
ఆత్మహత్యే పరిష్కారం కాదు..
న్యూస్‌రీల్
పల్లెలకు పాలనాధికారులు 103 మందికి నియామక పత్రాలు ఈనెల 11న కౌన్సెలింగ్, మెరిట్ ప్రాతిపదికన పోస్టింగ్ గ్రామాల్లో పరిష్కారం కానున్న రెవెన్యూ, భూసమస్యలు
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన జిల్లా
పరిహారం కోసం బాధిత రైతుల ఎదురుచూపు..
బాసరలో రిటైనింగ్ వాల్ నిర్మించాలని స్థానికుల డిమాండ్
పెద్దాస్పత్రి నిర్మాణంపై ఆశలు..
నేడు జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి ‘జూపల్లి’ పర్యటన
సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎదుర్కోవాలి. బుధవారం ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా కథనం.
నిర్మల్
భైంసా:గత నెల చివరి వారంలో జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు జిల్లాలో గోదావరి పోటెత్తడంతో జిల్లాను అతలాకుతలం చేశాయి. రైతుల పంట పొలాలు, గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారులు, బాసర పుణ్యక్షేత్రాన్ని కూడా వరదలు తాకాయి. ఈ నేపథ్యంలో జిల్లా రైతులు, భక్తులు ప్రభుత్వం నుంచి ప్రత్యేక పరిహారం, సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కోరుతున్నారు.
వరద విధ్వంసం..
భారీ వర్షాలకుతోడు గోదావరి, మంజీర నదులు ఉప్పొంగడంతో జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జీవనాధారమైన పంటలను కోల్పోయిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వరదలకు గ్రామీణ మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. వరదలకు పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. పొలాల్లో ఇసుక మేటలు వేసింది. కొన్ని చోట్ల పంటలు పూర్తిగా కొట్టుకుపోయాయి. వాగు సమీపంలోని భూములపై ఇసుక మేటలు ఏర్పడటంతో నష్టం మరింత తీవ్రమైంది. గ్రామీణ రోడ్లు, భైంసా–బాసర ప్రధాన రహదారి వద్ద బిద్రెల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి కోతకు గురైంది. ఇది రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. జిల్లా రైతులు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా పరిహారం అందించాలని కోరుతున్నారు. అయితే, పక్కా సర్వే ఇంకా జరగకపోవడంతో నష్టపరిహారం ఎటూ తేలడం లేదు. రైతులు నష్టపోయిన వివరాలను సేకరించి, త్వరితగతిన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
బాసర పట్టణాన్ని ముంచిన వరద..
తెలంగాణలో ప్రసిద్ధమైన బాసర శ్రీజ్ఞాన సరస్వతీదేవి కొలువై ఉనన బాసర పట్టణంలోకి గోదావరి వరద పోటెత్తింది. నది ఉప్పొంగడంతో ఆలయ ప్రాంగణం, స్నానఘట్టాలు, సమీప ప్రాంతాలు నీటమునిగాయి. మహారాష్ట్ర, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి, మంజీర నదులు ఉప్పొంగి, బాసరలోని ప్రధాన రోడ్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రైవేటు దుకాణ సముదాయాలు నీటమునిగాయి. స్నానఘట్టాలు రెండు రోజులపాటు నీటిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి నదికి ఆనుకొని వంతెన నుంచి స్నానఘట్టాల వరకు రిటర్నింగ్ వాల్ (రక్షణ గోడ) నిర్మించాలని పట్టణవాసులు కోరుతున్నారు. భద్రచలం తరహాలో రక్షణ గోడ నిర్మిస్తే, భవిష్యత్తులో వరద నీరు ఆలయ ప్రాంగణంలోకి చొచ్చుకురాదని వారు భావిస్తున్నారు. రాబోయే రెండేళ్లలో జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి రిటైనింగ్ వాల్ నిర్మించాలని కోరుతున్నారు.
ఆర్జీయూకేటీలో కాళోజీ జయంతి
బాసర:బాసరలోని ఆర్జీయూకేటీలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 111వ జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, విశిష్ట అతిథిగా ఓఎస్టీ ప్రొఫెసర్ మురళీధర్శన్ హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ విఠల్, విభాగాధిపతి డాక్టర్ రమాదేవి, అధ్యాపకులు డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ గోపాలకృష్ణ, డాక్టర్ రాములు, డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ రాయమల్లు పాల్గొన్నారు.
12న కళా ఉత్సవ్ పోటీలు
నిర్మల్ రూరల్:జిల్లాస్థాయి కళా ఉత్సవ్ పోటీలు ఈనెల 12న జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో నిర్వహించనున్నట్లు డీఈవో భో జన్న తెలిపారు. 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించా లని సూచించారు. వివరాలకు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
మంత్రి దృష్టికి తీసుకెళ్లేలా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం జిల్లాకు వస్తున్నారు. రైతులకు పరిహారం, గోదావరి రిటైనింగ్‌వాల్, బాసరలో పెద్ద ఆస్పత్రి నిర్మాణా నికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రైతులు, వరద బాధితులు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నష్టపోయిన పంటలు, ఇసుక మేటలు వేసిన భూ ములకు ఎక్కువ పరిహారం అందించాలని కోరుతున్నారు. వరదలకు ధ్వంసమైన గ్రా మీణ రోడ్లు, జాతీయ రహదారులను త్వరగా పునర్నిర్మించాలని స్థానికులు ఆశిస్తున్నారు.
వైద్య సౌకర్యాల కొరత..
బాసర ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, మండల కేంద్రం, ట్రిపుల్‌ఐటీ వంటి విద్యా సంస్థలకు నిలయం. అయినా అత్యవసర వైద్య సౌకర్యాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. బాసరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ అయినా అత్యవసర సేవలు అందించే సామర్థ్యం లేదు. ప్రస్తుతం 30 పడకల ఆస్పత్రిగా సేవలు అందిస్తున్న ఈ కేంద్రం రద్దీని తట్టుకోలేకపోతోంది. బాసరవాసులు 100 పడకల పెద్ద ఆసుపత్రి నిర్మాణం కోసం డిమాండ్ చేస్తున్నారు. గోదావరి నదిలో ప్రమాదాలు జరిగినప్పుడు లేదా అనునిత్యం రద్దీగా ఉండే బాసరలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం పెను సమస్యగా మారింది.

ఆత్మహత్యే పరిష్కారం కాదు..

ఆత్మహత్యే పరిష్కారం కాదు..