
ఆర్జీయూకేటీ అభివృద్ధికి చర్యలు..
బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి తెలిపారు. రూ.1.7 కోట్లతో కల్పించే మౌలిక వసతులకు శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో పాల్గొన్నారు. విద్యార్థులు తమకు కొత్త ల్యాప్‌ట్యాప్‌లు ఇవ్వడం లేదని, పాతవి ఇస్తున్నారని తెలిపారు. భోజ నం నాణ్యతతో ఉండడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. క్రికెట్ మైదానంలో వర్షపు నీరు నిలుస్తోందని పేర్కొన్నారు. స్పందించిన మంత్రి క్రికెట్ మైదానంలో వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కొత్త ల్యాప్‌ట్యాప్‌లు అందించేలా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలి పారు. చిన్న విషయాలకు ఆత్మహత్యల వంటి ఆ లోచనలకు పోవద్దని విద్యార్థులకు సూచించారు. ట్రిపుల్‌ఐటీ సాంస్కృతిక అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, యూని ఫాంలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రిపుల్‌ఐటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, పాల్గొన్నారు.