
ముదిరాజ్‌ల ఆందోళన
లక్ష్మణచాంద: తమకు న్యాయం చేయాలని కో రుతూ పీచర గ్రామ ముదిరాజ్‌లు నిర్మల్ ఏ ఎస్పీ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. హైకోర్టు గంగపుత్రులతోపా టు ముదిరాజ్‌లు కూడా చేపలు పట్టుకోవాలని ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. కానీ గ్రామస్తులు హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి తమ ను చేపలు పట్టుకోనివ్వడం లేదని పేర్కొన్నా రు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం తాము చేపలు పట్టుకునేందుకు సహకరించాలన్నారు. ఆందోళనలో ముదిరాజ్ రాష్ట్ర నాయకులు బొజ్జ నారాయణ, శివన్న, యాటకారి సాయన్న, పీచర గ్రామ ముదిరాజ్‌లు పాల్గొన్నారు.
కడెం రెండు గేట్లు ఎత్తివేత
కడెం:ఎగువన కురిసిన వర్షాలతో కడెం ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం 15,910 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్టు అధికా రులు రెండు వరద గేట్లను ఎత్తి 10,791 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699.125 అడుగులు ఉంది.
గేట్‌లో ఖానాపూర్‌వాసి ప్రతిభ
ఖానాపూర్: టీజీ సీపీగేట్–2025 ఫలితాల్లో మండలంలోని బావాపూర్(కె) గ్రామానికి విద్యార్థి కోరెపు రాజలింగు ప్రతిభ కనబర్చాడు. ఎంపెడ్ విభాగంలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాదించాడు. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన రాజలింగును గ్రామస్తులు అభినందించారు.
పీజీసెట్‌లో ముధోల్ వాసికి 17వ ర్యాంకు
ముధోల్: ఇటీవల విడుదలైన పీజీ సెట్ ఫలితాల్లో ముధోల్‌లోని కోలీగల్లీకి చెందిన బర్మొల్ల సాయిలు –కళ దంపతుల కుమారు డు వెంకటేశ్ ప్రతిభ కనబరిచారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో రాష్ట్రస్థాయిలో 17వ ర్యాంకు సాధించాడు. వెంకటేశ్‌నుపలువురు అభినందించారు.
సంతకం ఫోర్జరీపై ఫిర్యాదు
నిర్మల్:నర్సాపూర్(జి)మండలం చాక్‌పల్లి క్లస్టర్ ఏఈవో రమ్య సంతకం ఫోర్జరీపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతు బీ మా క్లెయిమ్ పత్రాలపై తన సంతకాలు ఫోర్జరీ చేసి రైతు బీమా నిధులు దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. సంతకాలు ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.

ముదిరాజ్‌ల ఆందోళన

ముదిరాజ్‌ల ఆందోళన

ముదిరాజ్‌ల ఆందోళన