
గాజుల పండుగ
నిర్మల్: లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్, మునిపల్లి మహిళలు మంగళవారం గాజుల పండుగ జరుపుకున్నారు. కనకాపూర్ మహిళలు స్థానిక రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద, మునిపల్లి మహిళలు గ్రామ సమీపంలో వ్యవసాయ క్షేత్రంలో స్నేహితులు, వదినామరదళ్లు, అక్కాచెల్లెళ్లు ఒకరికొకరు గాజులు వేసుకున్నారు. గోరింటాకు పెట్టుకుంటూ ఒకరికి ఒకరం కష్టసుఖాల్లో అండగా ఉండాలని ఆ అమ్మవారి సాక్షిగా కోరుకున్నారు. అనంతరం అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేశారు. రోజంతా ఆనందంగా గడిపారు.