
బడుగుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి సూర్యం
నిర్మల్ టౌన్: బడుగుల హక్కుల కోసం ప్రజలను చైతన్యం చేసి ప్రజాఉద్యమాన్ని నడిపిన వ్యక్తి మాజీ మావోయిస్టు వరకంటి పండరి అలియాస్ సూర్యం అని అమరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి, ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. పండరి విప్లవ ప్రస్తానని ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ.. ఆయన సోదరుడు రిటైర్డ్ పీజీ హెచ్‌ఎం వరకంటి మురళీధర్ రచించిన ‘ఆరని వెలుగు సూర్యం’ అనే పుస్తకాన్ని జిల్లా కేంద్రంలోని పెన్షనర్ భవనంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..జిల్లాలో పుట్టిన సూర్యం అలియాస్ పండరి 21 ఏళ్లకే ఉద్యమబాట పట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పీడిత ప్రజల హక్కుల కోసం 15 ఏళ్లు పోరాడి అమరుడైన విషయన్ని ఎవరూ మరిచిపోలేరన్నారు. ఆయన చరిత్ర నేటి తరానికి పుస్తక రూపంలో అందించేందుకు కృషి చేసిన కుటుంబ సభ్యులకు, ఉద్యమ నేతలుకృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, విప్లవ నేతలు ఎన్.వేణుగోపాల్, పినకపాణి, సత్వాజి, అజయ్, నాగరాజు, జ్యోతి పుస్తక రచయిత వరగంటి మురళీధర్, ప్రముఖ న్యాయవాది మల్లారెడ్డి, ఉద్యమకారులు పాల్గొన్నారు.