
సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనం కాళోజీ
నిర్మల్‌చైన్‌గేట్: పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు తెలంగాణ సాహిత్యానికి, సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనమని అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రజల హృదయాలకు హత్తుకునేలా, తెలంగాణ యాసలో కవితలు రాసి ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు. కాళోజీ పుట్టినరోజుని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు నరసింహారెడ్డి, రమణ, శ్రీకాంత్‌రెడ్డి, మోహన్‌సింగ్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
సమాజాన్ని జాగృతం చేసిన కవి కాళోజీ
నిర్మల్‌చైన్‌గేట్:సమాజాన్ని జాగృతం చేసిన కవి కాళోజీనారాయణరావు అని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శకుంతల అన్నారు. కాలోజీ 111వ జయంతిని స్థానిక నర్సింగ్ కళాశాలలో నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కాళోజి తెలుగు భాషకు, తెలంగాణ యాసకు వన్నెతెచ్చారన్నారు. తన రచనలతో సమాజాన్ని జాగృతం చేశారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మంజుల, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.