
మంత్రి పర్యటనకు ఏర్పాట్లు
నిర్మల్‌చైన్‌గేట్:జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ సమీపంలోని చంద్రశేఖర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. స్టాల్స్, సీటింగ్, స్టేజ్, పార్కింగ్ వంటి అంశాలను పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, తహసీల్దార్లు రాజు, సంతోష్ పాల్గొన్నారు.