
24గంటలు.. ఆన్‌డ్యూటీ
న్యూస్‌రీల్
నిర్మల్
తదితర శాఖలూ సేవల్లోనే..
పీజీ సెట్‌లో ప్రతిభ
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్‌కు చెందిన మేన రితీశ్ సోమవారం వెలువడిన పీజీ సెట్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చాడు. ఎంఎస్సీ ఫిజిక్స్‌లో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌లోని రైల్వే డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీ పూర్తి చేశాడు.
ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్ టౌన్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశమయ్యారు. ఓటర్ జాబితాలో డబుల్ ఓటర్లు ఉండకుండా చర్యలు చేపడతామన్నారు. ఒకటి కంటే ఎక్కువ కేంద్రాల్లో ఓటరుగా ఉంటే తొలగిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 4,49,302 మంది ఓటర్లు ఉన్నారని, వారి సౌకర్యార్థం 892 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్క బూత్‌లో 700–800 మందికి మించి ఓటర్లు ఉంటే అదనపు పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని పార్టీ ప్రతినిధులను కోరారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు లేవనెత్తిన అనేక అంశాలపై అధికారులు సమాధానమిచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
నిర్మల్: తమ కుటుంబాలకు దూరంగా జిల్లా పోలీసులు రోజులతరబడి రోడ్లపైనే డ్యూటీ చేశారు. తమ సంతోషాలనూ పక్కనపెట్టి శాంతిభద్రతలను కాపాడారు. చివరి రెండురోజులైతే కనురెప్ప వాల్చకుండా ‘ఖాకీలు’ పనిచేయడం వల్లే జిల్లాలో గణేశ్ నవరాత్రులు విజయవంతంగా ము గిశాయి. ఒక్క పోలీసుశాఖనే కాదు అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ, విద్యుత్, వైద్య తదితర శాఖలన్నీ సమష్టిగా పనిచేసి ఈ ఏడాదీ వినాయక ఉత్సవాలను విజయవంతం చేశాయి.
పోలీసులకు పెద్దటాస్క్..
రాష్ట్రంలోనే సున్నిత ప్రాంతంగా పేరున్న నిర్మల్ జిల్లాలో వినాయక ఉత్సవాల నిర్వహణ అంటే కత్తి మీదసాము లాంటిది. గత ఘటనలను దృష్టిలో పెట్టుకుంటూ.. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా, అన్నివర్గాలనూ సంతృప్తిపరుస్తూ, ప్రశాంతంగా ఉత్సవాలు ముగించడం పోలీసుశాఖకు అతిపెద్ద టాస్క్. ఎస్పీ జానకీషర్మిల ఈసారి కూడా పకడ్బందీగా వ్యవహరించారు. నవరాత్రులతోపాటు నిమజ్జనోత్సవ శోభాయాత్రలనూ విజయవంతంగా పూర్తిచేశారు. ఉత్సవాల్లోనూ ప్రజలతో కలిసిపోతూ.. అన్నివర్గాల నుంచి భేష్.. అనిపించుకున్నారు. వినాయక ఉత్సవాల విజయంలో అన్నిశాఖల భాగస్వామ్యం ఉన్నప్పటికీ ప్రధానంగా రోజుల తరబడి రోడ్లపైనే బందోబస్తులో ఉండి, శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడ్డ పోలీసుల పాత్రపై ప్రశంసలు కురుస్తున్నాయి.
అన్ని శాఖలు కలిసి..
గణేశ్ ఉత్సవాల ప్రారంభానికి నెల ముందు నుంచే జిల్లాలో అధికార యంత్రాగానికి పనిమొదలవుతుంది. ఈసారి కూడా రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్, పంచాయతీ, విద్యుత్, వైద్య తదితర శాఖలన్నీ వినాయక ఉత్సవాల ప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాయి. మండపాలకు పర్మిషన్లు, విద్యుత్ కనెక్షన్లు, వేలాడుతున్న తీగల తొలగింపు, మంచినీటి వ్యవస్థ, రూట్‌మ్యాప్, నిమజ్జనం వద్ద ఏర్పాట్లు.. ఇలా ఎవరి పనులను వారు విభజించుకుని, సమష్టిగా ఉత్సవాల విజయవంతానికి పాటుపడ్డారు. కలెక్టర్ అభిలాషఅభినవ్ ఉత్సవాల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్.. సక్సెస్..
వినాయక ఉత్సవాల సమయంలోనే చిన్నపాటి ఘర్షణ జిల్లాలో అల్లర్లు, కర్ఫ్యూల వరకు దారితీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈక్రమంలో అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసుశాఖ ఈసారీ జాగ్రత్త పడింది. శాఖాపరంగా ప్రతీ నంబర్ గణపతి వద్ద 24 గంటలపాటూ నిఘా ఉండేలా కానిస్టేబుళ్లు అక్కడే ఉంటూ విధులు నిర్వర్తించారు. ఉదయం, రాత్రివేళల్లో వారిపై పర్యవేక్షణతోపాటు ప్రతీ గణేశ్ మండపం వద్దకు పోలీసులు అధికారులు గస్తీ తిరిగారు. చాలాచోట్లకు ఎస్పీ స్వయంగా వెళ్లి పర్యవేక్షించారు. ఇక ఈనెల 2న ముధోల్ నుంచి ప్రారంభమైన నిమజ్జనోత్సవాలు వరుసగా కొనసాగాయి. భైంసాలో 4న, నిర్మల్‌లో 6న నిర్వహించారు. దాదాపు వారంరోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా, రోడ్లపైనే నిల్చుని పోలీసులు సమర్థవంతంగా విధులు చేపట్టారు. నిర్మల్‌లో చివరి రెండురోజులు.. 48 గంటలు ఆన్ డ్యూటీలోనే ఉండి భేష్ అనిపించుకున్నారు.
సమష్టిగా పనిచేయడంతోనే..
జిల్లా అధికార యంత్రాంగం, సిబ్బంది సమష్టిగా పనిచేయడం, జిల్లా ప్రజలందరి సహకారంతోనే వినాయక నవరాత్రులు, నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా పూర్తిచేసుకున్నాం. భైంసా, నిర్మల్‌లోనూ శోభాయాత్రలు ప్రశాంతంగా పూర్తిచేయగలిగాం. రోజుల తరబడి ప్రతీ పోలీసు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పనిచేశారు. –డా.జానకీషర్మిల, ఎస్పీ
‘చూడమ్మా.. బాగా చూడు.. కనిపిస్తోందా..! బంగల్‌పేట్ గణపతి ఎంత పెద్దగా ఉందో చూడు. ఇంతకుముందు చూసిన బుధవార్‌పేట్ గణపతి కూడా చాలా పెద్దగా ఉంది కదా బేటా..! ఇంకా చాలా చూపిస్తా బేటా.. అప్పటి వరకు అమ్మ నీకు అన్నం తినిపిస్తుంది ఓకేనా..!!’ అంటూ వీడియోకాల్‌లో ఆ తండ్రి చెబుతుండగా.. ‘అది కాదు నాన్నా.. నువ్వు ఇంకెప్పుడు ఇంటికొస్తవ్. అమ్మను, అన్నయ్యను, నన్ను ఎప్పుడు బయటికి తీసుకెళ్లి గణేశ్‌లను చూపిస్తవ్. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ల అమ్మనాన్నలతో టూత్రీ టైమ్స్ వెళ్లారు. ఇప్పుడు కూడా అందరూ గణేశ్‌లను చూడటానికే వెళ్లారట. నువ్వేమో ఇంకా రావట్లేదు. అమ్మను అడిగితే.. ఇలా.. వీడియోకాల్‌లో నిన్ను, గణేశ్‌లను చూపిస్తోంది..’ అంటూ ఆ చిన్నారి అలా మాట్లాడుతుంటే.. కరుకు ఖాకీ డ్రెస్‌లో ఉన్న ఆ నాన్న కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. వెంటనే తేరుకుంటూ..‘వస్తా బేటా.. వస్తా.. నువ్వు తిను..’ అంటూ అయిష్టంగానే ఆ వీడియోకాల్ కట్‌చేశాడు. తన విధిలో నిమగ్నమయ్యాడు.
అటు వరదలు.. ఇటు ఉత్సవాలు..
ఈ నెలరోజుల వ్యవధిలోనే ఓ దిక్కు భారీవర్షాలు, పోటెత్తిన వరదలు బెంబేలెత్తించాయి. జిల్లా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాయి. వాతావరణ శాఖ నివేదికలతో వారం పదిరోజులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోదావరిలో చిక్కుకుపోయినవారిని కాపాడేందుకూ గంటల తరబడి వేచిఉండాల్సి వచ్చింది. వరద మిగిల్చిన నష్టాన్ని అంచనా వేయడం ఒకెత్తు. అలా భారీవర్షంలోనే వినాయక చవితి వచ్చేసింది. ఇటు వరదలు, అటు నవరాత్రులు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ జిల్లా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.

24గంటలు.. ఆన్‌డ్యూటీ

24గంటలు.. ఆన్‌డ్యూటీ

24గంటలు.. ఆన్‌డ్యూటీ