
‘లంబాడాలు ఎస్టీలు కాదు’
కడెం: లంబాడాలు ఎస్టీలు కాదని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు ఇస్తుందని మాజీ ఎంపీ, రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయంబాపూరావు అన్నారు. మండలంలోని నర్సాపూర్ గొండుగూడలో సోమవారం నిర్వహించిన రాజ్‌గోండ్ సేవా సమితి గోండ్వానా పంచాయతీ రాయి సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రాలు ఎలాంటి నివేదికలు ఇచ్చిన లంబాడాలు ఎస్టీలు కాదని సుప్రీంకోర్టు తీర్పునిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివాసీలంతా తమ దేవతలైన జంగుబాయి, పెర్సాపేన్‌ను మొక్కాలన్నారు. ఇందులో గొండ్వనా గోండు మహాసభ జాతీయ ఉపాధ్యాక్షుడు సిడాం అర్జున్, ప్రధాన కార్యదర్శి విషంరావు, ఆనంద్‌రావు, కురం శ్యాంరావు, మోతీరాం, వెడ్మ కొద్దు, గుణవంత్‌రావు, నరసింహారావు, రాజేశ్వర్, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.