పీఎంశ్రీ వచ్చింది.. వసతులు తెస్తోంది.. | - | Sakshi
Sakshi News home page

పీఎంశ్రీ వచ్చింది.. వసతులు తెస్తోంది..

Sep 9 2025 1:16 PM | Updated on Sep 9 2025 1:16 PM

పీఎంశ

పీఎంశ్రీ వచ్చింది.. వసతులు తెస్తోంది..

● ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ● తొలగుతున్న విద్యార్థుల కష్టాలు ● జిల్లాలో 20 పాఠశాలలు ఎంపిక

పీఎంశ్రీ పాఠశాలలు హరిత పాఠశాలలుగా రూపొందుతున్నాయి. పాఠశాల గేటు వద్ద సైకస్‌, రాయల్‌ ఫామ్‌, అరకేరియా, రామబాణం, జిరేనియం, కాజురైనా, తూజా వంటి అలంకరణ మొక్కలు, తరగతి గదుల చుట్టూ ఏర్పాటు చేసిన భారీ వృక్షాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈ హరిత వాతావరణం విద్యార్థులకు సానుకూల ఆలోచనలను, పర్యావరణ స్పృహను కలిగిస్తోంది. హరిత పాఠశాలల ఏర్పాటు ద్వారా విద్యార్థులలో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెరుగుతోంది. గ్రీన్‌ గార్డెన్‌ ఫీల్డ్‌ ట్రిప్స్‌ ద్వారా విద్యార్థులు పర్యావరణ రక్షణ యొక్క ప్రాముఖ్యతను ఆచరణాత్మకంగా నేర్చుకుంటున్నారు.

లక్ష్మణచాంద: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా’ (పీఎం శ్రీ) పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక వసతులతో కార్పొరేట్‌ పాఠశాలల్లా మారుతున్నాయి. ఈ పథకం కింద జిల్లాలోని 20 పాఠశాలలు ఎంపికై , విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలను అందిస్తున్నాయి.

వినూత్న విద్యా విప్లవం..

పీఎంశ్రీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి, విద్యార్థులకు కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో విద్యా అనుభవాన్ని అందించడానికి కృషి చేస్తోంది. ఈ పథకం కింద ఎంపికై న పాఠశాలలు అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ విద్య విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.

ఎంపికై న పాఠశాలలు..

జిల్లాలో లక్ష్మణచాంద ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాసర ప్రభుత్వ ఉన్నత పాఠశాల, దేగాం ఉన్నత పాఠశాల, దిలావార్‌పూర్‌ ఉన్నత పాఠశాల, కడెం ఉన్నత పాఠశాల, తానూర్‌ ఉన్నత పాఠశాల, కొరిటికల్‌ ఉన్నత పాఠశాల, జుమ్మరత్‌పేట్‌ ఉన్నత పాఠశాల, బూరుగుపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, కేజీబీవీ దస్తురాబాద్‌, కేజీబీవీ కుబీర్‌, తెలంగాణ మోడల్‌ పాఠశాల కుంటాల, తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు (ఎల్లాపూర్‌, ముధోల్‌, లెఫ్ట్‌పోచంపాడ్‌, జామ్‌), ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమ పాఠశాలలు (కుబీర్‌, ఈద్‌గాం, ఓవైసీనగర్‌) ఈ పథకంలో ఎంపికయ్యాయి.

కార్పొరేట్‌ స్థాయిలో..

పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలలు కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా మారుతున్నాయి. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, తరగతి గదుల లేమి, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పీఎంశ్రీ పథకం ద్వారా ఈ సమస్యలు తొలగిపోతున్నాయి. పాఠశాలల్లో కొత్త తరగతి గదుల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు, సైన్స్‌ ల్యాబ్‌ల నిర్మాణం, బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి.

డిజిటల్‌ విద్య..

పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే, ఆసక్తికరమైన అభ్యాస అనుభవం లభిస్తోంది. ఒక్కో పా ఠశాలకు 10 కంప్యూటర్లు అందించడం, డ్యూయల్‌ డెస్క్‌ బెంచీలు, ఫ్యాన్లు, మంచినీటి సౌకర్యాలు వి ద్యార్థుల సౌకర్యాన్ని పెంచుతున్నాయి. అదనంగా, పాఠశాల ఆవరణలో పచ్చదనం, అలంకరణ మొ క్కలు, ఆకర్షణీయమైన గేట్లు విద్యార్థులకు స్ఫూ ర్తిదాయకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి చర్యలు..

పాఠశాలల్లో స్థాపించిన పోస్టర్లు విద్యార్థులను ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, కఠిన శ్రమతో అవి సాధించే దిశగా ప్రోత్సహిస్తున్నాయి. ‘‘నిన్ను నీవు నమ్మి, లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకు’’ వంటి సందేశాలు విద్యార్థులలో స్ఫూర్తిని నింపుతున్నాయి. అదనంగా, ఎకో, యూత్‌ క్లబ్‌ల ఏర్పాటు ద్వారా విద్యార్థులు సామాజిక బాధ్యతలను, జట్టుగా పనిచేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. విద్యార్థుల అభ్యాసన అనుభవాన్ని సుసంపన్నం చేసేందుకు హైదరాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌ వంటి ప్రాంతాలకు విహార యాత్రలు, గ్రీన్‌ గార్డెన్‌లకు ఫీల్డ్‌ ట్రిప్స్‌ నిర్వహిస్తున్నారు. ఇవి విద్యార్థులలో సృజనాత్మకత, పర్యావరణ అవగాహన, ఆలోచనా శక్తిని పెంపొందిస్తున్నాయి.

హరిత పాఠశాలలుగా మార్పు..

మౌలిక సదుపాయాలు

జిల్లాలో పీఎంశ్రీ పథకంలో 20 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ పాఠశాలల్లో అదనపు గదులు, సైన్స్‌ ల్యాబ్‌లు, డ్యూయ ల్‌ డెస్కు బెంచీలు, మూత్ర శాలలు, తాగు నీరు, విద్యుత్‌ సౌకర్యం వంటివి సమకూరుతున్నాయి. – భోజన్న, డీఈవో, నిర్మల్‌

పీఎంశ్రీ వచ్చింది.. వసతులు తెస్తోంది.. 1
1/2

పీఎంశ్రీ వచ్చింది.. వసతులు తెస్తోంది..

పీఎంశ్రీ వచ్చింది.. వసతులు తెస్తోంది.. 2
2/2

పీఎంశ్రీ వచ్చింది.. వసతులు తెస్తోంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement