
పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి
నిర్మల్‌టౌన్: జిల్లాలో ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు, ఆస్తులు నష్టపోయినవారికి పరిహారం అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్‌రాథోడ్ అన్నారు. ఈమేరకు బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా రితేష్ రాథోడ్ మాట్లాడుతూ.. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలన్నారు. కొట్టుకుపోయి న రోడ్లకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. కడెం ప్రాజెక్టు వరద ప్రభావంలో కొట్టుకుపోయిన కడెం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి గంగాధర్ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్‌కు వినతిపత్రం అందజేశారు. బీజేపీ సీనియర్ నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్ , పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఆకుల శ్రీనివాస్, పలువురు నాయకులు పాల్గొన్నారు.