
ఉద్యోగుల మానసికోల్లాసానికి క్రీడలు
నిర్మల్‌టౌన్: శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగా ణ ఆధ్వర్యంలో ఉద్యోగులకు జిల్లాస్థాయి పో టీలు సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని తమ ప్రతి భను ప్రదర్శించారు. చెస్, క్యారం, టేబుల్ టెన్నిస్ వంటి ఇండోర్ గేమ్స్‌తోపాటు ఔట్‌డో ర్ గేమ్స్ కూడా నిర్వహించారు. ప్రతీ విభాగంలో పోటీదారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. కార్యక్రమంలో పీడీలు ఎం.శ్రీనివాస్, రమణారావు, అన్నపూర్ణ, సత్తయ్య, అంబాజీ, భోజన్న, వెన్నెల, భూమన్న పాల్గొన్నారు.