
అర్జీదారుల దరఖాస్తులు పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: ప్రజావాణిలో అర్జీదారుల నుంచి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం పీవో చాంబర్‌లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఆసిఫాబాద్‌కు చెందిన నిఖిల్ ల్యాప్‌టాప్ ఇప్పించాలని, సోనాల మండలం దేవునాయక్ తండాకు చెందిన లక్ష్మణ్ ఆర్వోఎఫ్‌ఆర్ పట్టా మంజూరు చేయాలని, తాండూర్‌కు చెందిన విజయలక్ష్మి ట్రైకార్ రుణం ఇప్పించాలని, నార్నూర్ మండలం కొలాంగూడకు చెందిన జంగు టెంట్ హౌజ్ కోసం, గాదిగూడకు చెందిన శిరీష ఇల్లు మంజూరు కోసం అర్జీలు సమర్పించారు.
ల్యాప్‌టాప్‌లు పంపిణీ
ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రతిభ కనబర్చిన ఉట్నూర్ మండలంలోని ఎనిమిది మంది గిరిజన విద్యార్థులకు సోమవారం ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసినట్లు పీవో తెలిపారు.