
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కాసిపేట: మండల కేంద్రంలోని తెలంగాణ మాడల్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న జక్కుల అశ్విన్ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ అబ్ధుల్ ఖలీల్ తెలిపారు. ఈనె ల 7న గోలేటిలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 4వ సబ్ జూనియర్ బాలబాలికల అండర్–14 పోటీల్లో ప్రతిభ కనబరిచి జనగామ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. సదరు విద్యార్థిని సోమవారం అభినందించారు.
కరాటే పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్ జిల్లా కుంగ్‌ఫూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మందమర్రి సీఐఎస్‌ఎఫ్ బరాక్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి 2వ ఓపెన్ కుంగ్‌ఫూ, కరాటే చాంఫియన్ షిప్ పోటీల్లో సదరు పాఠశాల విద్యార్థినులు అశ్విత, పి.నేహ, ఆర్.మనస్విని స్వర్ణ పతకాలు, బి.సింధు, ఎస్, కీర్తన, బి.అక్షర, హన్షిత, లౌక్యశ్రీలు రజత పతకాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. సదరు విద్యార్థులను, కరాటే మాస్టర్ రవిని ప్రిన్సిపాల్ ఖలీల్, ఉపాధ్యాయులు అభినందించారు.