
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
తానూరు: మండల కేంద్రంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జాదవ్ దినేష్ ఇంట్లో చోరీకి పాల్పడినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. బాధితుడు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న దొంగలు ఇంటి వెనుక నుంచి లోనికి చొరబడి బీరువాలో ఉన్న ఒకటిన్నర తులాల నకలేష్, 5 గ్రాముల చెవి కమ్మలు,7 తులాల వెండి, రూ.30 వేల నగదు అపహరించారు. సోమవారం దినేష్ ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉంది. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్సై షేక్ జుబేర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.