
గ్రామ పొలిమేరలోనే వాహనాలు
ఇంద్రవెల్లి: మండలంలోని గౌరపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గౌరపూర్, చిత్తబట్ట గ్రామాలకు మధ్యలో ఉన్న వాగుపై వంతెన నిర్మించకపోవడంతో వర్షాకాలంలో గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు నెల ల పాటు తమ ద్విచక్ర వాహనలు, ఆటోలను వాగుకు అవతల ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అత్యవసర సమయంలో ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటువైపు వ్యవసాయ భూ ములున్న రైతులు, గ్రామస్తులు గ్రామపంచా యతీ కార్యాలయానికి వెళ్లాలంటే ప్రాణాలకు తెగించి వాగు దాటుతున్నారు. వాగుపై వంతెన నిర్మించాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా చిత్తబట్ట వాగుపై వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

గ్రామ పొలిమేరలోనే వాహనాలు