
అంబులెన్స్‌లో ప్రసవం
ఇచ్చోడ: బజార్‌హత్నూర్ మండలం సోనేరావుగూడ గ్రామానికి చెందిన జయమాల అనే గర్భి ణి అంబులెన్స్‌లో ప్రసవించింది. ఆదివారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో భర్త చరణ్‌దాస్ అంబులెన్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని ఆమెను ఇచ్చోడ పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికమయ్యాయి. అంబులెన్స్‌ను రోడ్డు పక్కన నిలిపి ఈఎంటీ శశికాంత్ ఆమెకు ప్రసవం చేయగా ఆడ్డపిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను ఇచ్చోడ పీహెచ్‌సీకి తరలించారు. ఈఎంటీ శశికాంత్, పైలెట్ జైసింగ్‌లకు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.