
సెపక్‌తక్రా ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ఎంపిక
రెబ్బెన: మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌లో సింగరేణి ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఆదివారం సెపక్‌తక్రా ఉమ్మడి జిల్లా సీనియర్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చి ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికై నవారు ఈనెల 20 నుంచి 22 వరకు మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో పాలిటెక్నిక్ కళాశాలలో జరగబోయే అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొంటారని అసోషియేషన్ ఉమ్మడి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కుమ్మరి మల్లేశ్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్‌రెడ్డి, క్రీడాకారులు నరేశ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపికై న క్రీడాకారులు..
సెపక్‌తక్రా ఉమ్మడి జిల్లా సీనియర్ పురుషుల జట్టుకు ఆడే రాజేందర్, ఆర్.వెంకటేశ్, చందు, రాజశేఖర్, రాందాస్, మహిళల జట్టుకు టి.అనూష, కె.స్ఫూర్తి కారుణ్య, జె.నేహశ్రీ, అభినవ రమ్య, కె. శ్రీవల్లి ఎంపికయ్యారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులను అసోషియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, సెపక్‌తక్రా అసోషియేషన్ సంయుక్త కార్యదర్శి శిరీష, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె.భాస్కర్, ఆర్.రామకృష్ణ, జి.శ్రీధర్, పి.సాంబయ్య అభినందించారు.