
పాముకాటుకు యువరైతు మృతి
నేరడిగొండ: అడవి పందు ల బారి నుంచి పంట కాపాడుకునేందుకు కాపలా వెళ్లిన యువ రైతు పా ముకాటుకు గురై మృతి చెందాడు. మండలంలోని గాజిలి గ్రామంలో ఈ ఘ టన చోటుచేసుకుంది. గ్రా మానికి చెందిన అనసూయ–వెంకట్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నా రు. గ్రామంలో పదెకరాల వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెండో కుమారుడు యువ రైతు చిక్రం లింగు (20) బుధవారం రాత్రి వారి పంట కాపలా కోసం అక్కడికి వెళ్లాడు. గురువారం ఉదయం ఇంటికి రాకపోయేసరికి కుటుంబీకులు వెళ్లి చూడగా లింగు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానిక వైద్యుడికి చూపించగా, మెరుగైన వైద్యం కోసం 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. శనివారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.