
పాపికొండలను తలపిస్తున్న ‘కడెం’
కడెం: కడెం ప్రాజెక్ట్ అందాలు బాగున్నాయని, పాపికొండలను తలపిస్తుందని హైకోర్టు జడ్జి సృజన అన్నారు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కడెం వచ్చారు. బృందావన్ రిసార్ట్స్‌లో విడిది అనంతరం ఆదివారం ఉదయం కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఆయకట్టు, వరద గేట్లు, నీటిమట్టం తదితర వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మిషన్ భగీరథ ఇంటెక్‌వెల్‌ను పరిశీలించారు. ప్రాజెక్ట్‌లో కుటుంబ సభ్యులతో కలిసి బోటింగ్ చేశారు. ఆమె వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, ఆర్‌ఐ శారద, రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ సిబ్బంది ఉన్నారు.