
ఎస్జీఎఫ్ క్రీడలు విజయవంతం చేయండి
ఇచ్చోడ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా త్వరలో నిర్వహించే ఎస్జీఎఫ్ క్రీడలను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ఆడే రామేశ్వర్ కోరారు. మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో క్రీడాజట్ల ఎంపిక పోటీల నిర్వహణపై చర్చించారు. 43 క్రీడాంశాల్లో 14, 17 ఏళ్ల విభాగం బాలుర, బాలికల జోనల్ వేదికలు ఖరారు చేసినట్లు తెలిపారు. జట్ల ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయ, క్రీడా సంఘాలు, పీడీ, పీఈటీలు, సహకారంతో పోటీలు విజయవంతం చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. సమావేశంలో మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు ఎండీ యాకుబ్, రవీందర్‌గౌడ్, వెంకటేశ్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా వ్యాయమ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె,పార్ధసారఽథి, బుక్యా రమేశ్, కె.భోజన్న, సాయికుమార్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.