
గ్రహణం ఎఫెక్ట్.. ఆలయాలు మూసివేత
మూసివేసిన కాల్వ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన ద్వారం
‘గూడెం’ వద్ద..
మూసివేసిన శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయం
దిలావర్‌పూర్‌లో..
దిలావర్‌పూర్: మండలంలోని ప్రధాన ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం మూసివేశారు. స్థానిక ఏకనాథుని, రేణుక ఎల్లమ్మ, నవాంజనేయ, శ్రీమాతా న్నపూర్ణ పాపహరేశ్వర, కాల్వ పరిసర అటవీ ప్రాంతంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను అర్చకులు మూసివేశారు. సోమవారం సంప్రోక్షణ అ నంతరం భక్తులకు దర్శనం కలుగజేస్తామని ఆలయ వర్గాలు వెల్లడించాయి.
జైనథ్‌లో
జైనథ్: మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయానికి ఆదివారం ఉదయం 10:30 గంటలకు మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం 4:00 గంటలకు తెరవనున్నారు. గ్రహ సంప్రోక్షణ, అనంతరం స్వామివారికి హారతి కార్యక్రమం తర్వాత 6 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని ఈవో చంద్రశేఖర్ తెలిపారు.
దండేపల్లి: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ప్రధాన ఆలయంతోపాటు, అనుబంధ ఆలయాలను మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు.

గ్రహణం ఎఫెక్ట్.. ఆలయాలు మూసివేత

గ్రహణం ఎఫెక్ట్.. ఆలయాలు మూసివేత