
మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుపై ఫిర్యాదు
మంచిర్యాలటౌన్: మంచిర్యాలలో శనివారం వినాయక నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుపై అసత్య ఆరోపణలు చేసిన మాజీ ఎ మ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుపై చర్యలు తీసుకోవాలని హిందుత్వవాదులు, ఛత్రపతి శివా జీ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడారు. గణేశ్ నిమజ్జనాన్ని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించగా, వేదికపైకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అసత్యపు మాటలతో రాజకీయ వేదికగా మార్చి, విద్వేషాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యేతోపాటు అనుచరులపై మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
మూడు ఆలయాల్లో చోరీ
ఖానాపూర్: పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంతోపాటు తర్లపాడ్‌లోని ఓంకారేశ్వర, అగ్గిమల్లన్న ఆలయాల్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. వీరబ్రహ్మేద్ర స్వామి ఆలయంలో 6 సీసీ కెమెరాలు, డీవీఆర్, 4 గ్రాముల పు స్తెలు, ఓంకారేశ్వర ఆలయంలో సీసీ కెమెరాతో పాటు హుండీలో నగదు, కానుకలు, అగ్గిమల్లన్న ఆలయంలో హుండీని పగులగొట్టి నగదు, కానుకలను దొంగలు ఎత్తుకెళ్లారు. పట్టణంలో ని శివాజీనగర్ కాలనీకి చెందిన సూదం శ్రీని వాస్ బైక్‌ను దొంగిలించారు. ఆలయకమిటీ సభ్యుల ఫిర్యాదులపై కేసులు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావుపై ఫిర్యాదు