
బాల్‌బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక
రెబ్బెన: రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుల్బం చక్రపాణి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్–14 బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. పోటీలకు సుమారు 30 మంది బాలికలు, 20 మంది బాలుర హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులకు పోటీలు నిర్వహించి జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఈనెల 13 నుంచి 14 వరకు జనగామ జిల్లా కూనురులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొంటారని బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్‌రెడ్డి, సీనియర్ క్రీడాకారులు నరేశ్ పాల్గొన్నారు.
ఎంపికై న క్రీడాకారులు
ఉమ్మడి జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ బాలిక జట్టుకు ఎం.సహాస్ర, టి.ప్రజ్వల శ్రీ, పి.శ్రావ్య,ఎస్.సాయిశ్రీ వర్షిణి, డి.వేరోనికా, జి.హన్నా, పి.సిరి, బి.రాజేశ్వరి, పి.పవిత్ర, ఎండీ అల్వీన, ఎస్.రిషిత, డి.నందిని, ఎస్.విజయస్పూర్తి, ఎండీ జేబా, బాలుర జట్టుకు వరుణ్, నిఖిల్, ఎం.కృష్ణ లోకనందు, సీహెచ్ అఖిల్, బి.రాఘవ, బి.ఆంజనేయులు, కె.స్ట్టీఫెన్, జె.అశ్విన్, ఎం.తిరుపతి, సీహె చ్ అరవింద్, డి.విష్ణువర్ధన్, ఎం.త్రిచూర్ కృష్ణ ఎంపికయ్యారు.