
యూరియా కోసం ఆందోళన
కడెం: యూరియా కోసం మండల కేంద్రంలో రైతులు శనివారం రోడ్డెక్కారు. నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు. యూ రియా కోసం ప్రతీరోజు మండల కేంద్రానికి వచ్చినా దొరకడం లేదని, ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతునేత హపవత్ రాజేందర్ మాట్లాడుతూ... కలెక్టర్ జిల్లాలో యూరియా కొరత లేదని చేబుతున్నారని, ఇక్కడ రైతులు పనులు వదులుకునే యూరియా కోసం రోజు ల తరబడి తిప్పలుపడుతున్నారని తెలిపారు. ఇకనైనా స్పందించి యూరియా కొరత తీర్చాల ని డిమాండ్ చేశారు. తహసీల్దార్ ప్రభాకర్, ఎస్సై సాయికిరణ్, ఏవో దినేశ్ అక్కడికి చేరుకుని సాయంత్రం లోడు వస్తుందని తెలుపడంతో ఆందోళన విరమించారు. ఇందులో మాజీ వైప్ ఎంపీపీ శ్యాంసుందర్ పాల్గొన్నారు.