
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయ దినో త్సవం ఘనంగా నిర్వహించారు. డీఈవో భోజన్న, అధికారులు సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేసి, అంచెలంచెలుగా ఎదిగిన మహానీయుడని కొనియాడారు. ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నతమైన భావాలు, ఆశయాలు అందిపుచ్చుకుని వృత్తికి న్యాయం చేయాలని కోరారు. ఇందులో సెక్టోరియల్ అధికారులు రాజేశ్వర్, ప్రవీణ్‌కుమార్, లింబాద్రి, జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ సహాయ కార్యదర్శి భానుమూర్తి పాల్గొన్నారు.