శోభాయాత్రకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

శోభాయాత్రకు సర్వం సిద్ధం

Sep 6 2025 7:09 AM | Updated on Sep 6 2025 7:09 AM

శోభాయ

శోభాయాత్రకు సర్వం సిద్ధం

శనివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025 8లోu

న్యూస్‌రీల్‌

నేడు నిర్మల్‌లో గణేశ్‌ నిమజ్జనోత్సవం ఏర్పాట్లు చేసిన ఉత్సవ సమితి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు నిమజ్జన యాత్ర ప్రారంభించనున్న ఎమ్మెల్యే ‘ఏలేటి’

విగ్రహాలను తరలించే వాహనాలు కండీషన్‌లో ఉండాలి. టైర్లు, బ్రేకులను ముందుగా చెక్‌ చేసుకోవాలి.

అనుభవజ్ఞులైన, లైసెన్స్‌ ఉన్న డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడపాలి.

చీకటి పడకముందే నిమజ్జనం పూర్తయ్యేలా ప్లాన్‌ చేయాలి.

నీటిలోకి వెళ్లే వారు ఈతలో నైపుణ్యం ఉన్నవారై ఉండాలి.

నిర్మల్‌

జోరుగా పేకాట..!

భైంసా పట్టణంలోనే కాకుండా జిల్లాలోని మండలకేంద్రాలు, గ్రామాల్లో పేకాట కోరలు చాస్తోంది. చాప కింద నీరులా వ్యాపిస్తోంది.

ఆర్జీయుకేటీలో మ్యాట్‌ల్యాబ్‌

బాసర ఆర్జీయుకేటీలో ట్రిపుల్‌ఈ విభాగం ఆధ్వర్యంలో నెక్సస్‌ క్లబ్‌ మ్యాట్‌ల్యాబ్‌ బూట్‌ శిక్షణ శిబిరం నిర్వహించారు.

వినాయకుడిని

దర్శించుకున్న కలెక్టర్‌

నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్‌ కాలనీలో కొలువుదీరిన నంబర్‌ 1 వినాయకుడిని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ తన భర్తతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. వినాయక మండలి నిర్వాహకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారిని సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. ఇందులో మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, గణేశ్‌ మండప నిర్వాహకులు పూదరి రంజిత్‌, సాయికృష్ణ, బద్రి శ్రీనివాస్‌, పతికే రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్‌ టౌన్‌: తొమ్మిది రోజులు భక్తుల పూజలందుకున్న గణనాథులు గంగమ్మ తరలేందుకు సిద్ధమవుతున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో గణపతికి వీడ్కోలు పలికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం ఉదయం నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. పట్టణంలో ప్రతిష్టించిన భారీ విగ్రహాలకు అధికారులు, పోలీసులు నంబర్లు కేటాయించారు. ఈ వరుస క్రమంలోనే శోభాయాత్ర మొదలు కానుంది. బుధవార్‌పేట్‌లోని మొదటి నంబర్‌ గణపతి వద్ద స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎస్పీ జానకీషర్మిలతోపాటు అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పాత బస్టాండ్‌, వివేక్‌ చౌక్‌, జయశంకర్‌ చౌరస్తా, నాగ్రేశ్వర్‌ వాడ, నిషాన్‌, ధ్యాగావాడ, పెద్ద మార్కెట్‌, వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, సోమవార్‌పేట, గాంధీచౌక్‌, నాయుడు వాడ, బేస్తవార్‌పేట మీదుగా బంగల్‌పేటలోని వినాయక సాగర్‌ వరకు శోభాయాత్ర సాగుతుంది.

డీజేలు నిషేధం..

అధిక శబ్దం కలిగించే డీజేలు, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన డీజేలను నిషేధించారు. బాణాసంచ, లేజర్‌ లైట్లు, డీజే వాహనాలపై కాగితాలు విసిరే మోటా ర్లు వినియోగించరాదని నిర్వాహకులకు సూచించా రు. రెండు సౌండ్‌ బాక్స్‌లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎస్పీ జానకీషర్మిల శోభాయాత్ర మార్గాన్ని, వినాయక సాగర్‌ వద్ద ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

శాంతియుతంగా జరుపుకోవాలి..

గణేశ్‌ నిమజ్జనోత్సవం శాంతియుతంగా జరిపేందుకు పోలీసులకు సహకరించాలి. నిమజ్జనానికి పోలీస్‌ బందోబస్తుతోపాటు, సీసీ కెమెరాలు, డ్రోన్లు ఉపయోగిస్తున్నాం. సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టొద్దు. పుకార్లు నమ్మవద్దు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నిమజ్జన శోభాయాత్రలో ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం.

– జానకీషర్మిల, ఎస్పీ

గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసు శాఖ భారీ బందోబస్తు చేపట్టింది. ఎస్పీ జానకీషర్మిల పర్యవేక్షణలో ఏడు సెక్టార్లలో 323 మంది కానిస్టేబుళ్లు, 31 మంది మహిళా కానిస్టేబుళ్లు, 106 మంది ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 34 మంది ఎస్సైలు, 11 మంది సీఐలు, ఇద్దరు ఏఎస్పీలు, ఒక అడిషనల్‌ ఎస్పీ బందోబస్తులో పాల్గొంటారు. శోభాయాత్ర మార్గంలో 180 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానం చేశారు. ఏదైనా అలజడి జరిగితే తక్షణం స్పందించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. శోభాయాత్రను చిత్రీకరించేందుకు వీడియో గ్రాఫర్లను కూడా నియమించారు.

వినాయకసాగర్‌ వద్ద ఏర్పాటు చేసిన

తాత్కాలిక టాయిలెట్స్‌, సిద్ధంగా ఉన్న క్రేన్‌

వినాయక సాగర్‌ వద్ద ఏర్పాట్లు..

వ్యవసాయం.. రసాయన రహితం

ఇంటర్‌ విద్యార్థులకూ ఎఫ్‌ఆర్‌ఎస్‌

పోలీసుల సూచనలు..

నిమజ్జనం కోసం బంగల్‌పేటలోని వినాయక సాగర్‌(బంగల్‌ చెరువు) వద్ద మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, విద్యుత్‌, ఫైర్‌, పోలీస్‌ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వినాయకసాగర్‌తోపాటు కంచేరోడి చెరువు, సిద్దాపూర్‌ వాగు వద్ద కూడా నిమజ్జనం కోసం సౌకర్యాలు కల్పించారు. వినాయకసాగర్‌ వద్ద రెండు క్రేన్లు, 12 మంది గజ ఈతగాళ్లు, జనరేటర్లు, 500 అదనపు వీధి దీపాలు, తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేశారు. చెరువ సమీపంలో బారికేడ్లు సిద్ధం చేశారు.

శోభాయాత్రకు సర్వం సిద్ధం1
1/3

శోభాయాత్రకు సర్వం సిద్ధం

శోభాయాత్రకు సర్వం సిద్ధం2
2/3

శోభాయాత్రకు సర్వం సిద్ధం

శోభాయాత్రకు సర్వం సిద్ధం3
3/3

శోభాయాత్రకు సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement