
భోసికి పోటెత్తిన భక్తులు
తానూరు: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భోసిలో నెలకొల్పిన కర్ర వినాయకుని ఆలయానికి శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నా రు. సెలవు దినం కావడంతో మన రాష్ట్రంతోపాటు, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో చేరుకుని గణనాథునికి పూజలు చేశారు. చివరి రోజు ఆలయంలో నిర్వహించిన హోమంలో దంపతులు పాల్గొన్నారు. 11 రోజులుగా పూజలందుకున్న కర్ర వినాయకుని నిమజ్జనోత్సవం శనివారం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉత్తం బాలేరావ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలాజీ తెలిపారు. మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి కార్యక్రమం, అన్నదానం అనంతరం గ్రామంలో శోభాయాత్ర ఉంటుందని వివరించారు.
నేడు కొరడి గణపతి నిమజ్జనం
భైంసారూరల్: మాటేగాంలో స్వయంభు కొరడి గణపతి నిమజ్జనం శనివారం జరుగనుంది. పది రోజులుగా వేలమంది భక్తులు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. నిమజ్జనోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటా రని నిర్వాహకులు తెలిపారు. ఆలయం నుంచి ప్రధాన వీధులగుండా శోభాయాత్ర జరుగుతుంది.

భోసికి పోటెత్తిన భక్తులు