
మరమ్మతులు ఎప్పుడో..
తానూరు: ఇటీవల కురిసిన భారీ వర్షానికి మండలంలోని బెల్‌తరోడ సట్వాజీవాగు సమీపంలో డబుల్‌రోడ్డు కోతకుగురైంది. బ్రిడ్జికి ఇరువైపులా మట్టి కొట్టుకుపోవడంతో ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిమీ దుగా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. కోతకుగురైన ప్రాంతంలో కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో రాత్రివేళ ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే మరమ్మతులు చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ, ఇప్పటికీ అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.