
అత్యవసర సేవలు అందేదెప్పుడు?
భైంసా: మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్న ముధోల్ నియోజకవర్గంలో అత్యవసర వైద్యసేవలు అందించే స్థాయి ఆస్పత్రులు లేక ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ, ఏడు మండలాలున్నా యి. భైంసాలో ఏరియాస్పత్రి ఉండగా, ముధోల్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) ఉంది. ఇక బాసర ప్రైమరీ హెల్త్ సెంటర్ (పీహెచ్‌సీ)ను సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయినప్పటికీ ఇందుకు అనుగుణంగా ఇప్పటివరకు సిబ్బందిని నియమించలేదు.
మిగతా చోట్ల పీహెచ్‌సీలే..
తానూరు, కుభీర్, కుంటాల, లోకేశ్వరం మండలా ల్లో పీహెచ్‌సీలే ఉండగా ఆయా మండలాల ప్రజ లకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. నియోజకవర్గంలో తండాలు అధికంగా ఉన్నాయి. అత్యధికంగా నిరుపేదలు ఉండే ఈ నియోజకవర్గంలో వైద్యం కోసం పక్కనే ఉన్న మ హారాష్ట్రకు వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి. తానూ రు, ముధోల్, బాసర మండల వాసులు మహారా ష్ట్రలోని ధర్మాబాద్‌కు, కుభీర్, భైంసా మండలవా సులు నాందేడ్‌కు, కుంటాల మండలవాసులు ని ర్మల్‌కు, లోకేశ్వరం మండలవాసులు నిజామాబా ద్‌కు వెళ్లాల్సి వస్తోంది. పీహెచ్‌సీలను సీహెచ్‌సీలు గా అప్‌గ్రేడ్ చేస్తే ఈ ఇబ్బందులు తప్పనున్నాయి. సీహెచ్‌సీల్లో సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోలతో కూడిన వైద్యబృందం అందుబాటులో ఉండనుండగా అత్యవసర సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక మిగతా సిబ్బంది సంఖ్య కూడా పెరగనుండడంతో పేషెంట్లకు అవసరమైన అన్ని రకాల సేవలు అందే అవకాశముంది.
సేవలపై ప్రత్యేక దృష్టి
ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వై ద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే భైంసా ఏరియాస్పత్రిలో దాతల సహకారంతో రోగులకు బెడ్లు ఏర్పాటు చేయించారు. డయాలసిస్ సేవలు వినియోగంలోకి తీసుకువచ్చారు. శనివారం తానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తంజేసి విషయం జిల్లా వైద్యాధికారితో ఫోన్‌లో తెలిపారు.
త్వరలో బాసరలో సేవలు
ముధోల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్యసేవలు అందుతున్నాయి. లోకేశ్వరం, కుంటాల, తానూరు, కుభీర్‌లో పీహెచ్‌సీలున్నాయి. అత్యధికంగా భక్తులు వచ్చే బాసర ప్రైమరీ హెల్త్ సెంటర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా మారనుంది. ఇప్పటికే ఉత్తర్వులు వచ్చాయి. అనేక మంది భక్తులు వచ్చే బాసరలో ఉత్తమ సేవలు అందించే విషయమై దృష్టిసారిస్తాం.
– రాజేందర్, జిల్లా వైద్యాధికారి
పీహెచ్‌సీల అప్‌గ్రెడేషన్ ఎప్పుడో!
ఇబ్బందుల్లో ‘సరిహద్దు’ ప్రజలు
భైంసా మున్సిపాలిటీలో ఇలా..
భైంసా మున్సిపాలిటీలో ఏరియాస్పత్రి ఉంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప రిధిలోని ఈ ఆస్పత్రి బస్టాండ్‌కు దగ్గరగా ఉంది. నియోజకవర్గంలో ఎక్కడ రోడ్డు ప్ర మాదం జరిగినా క్షతగాత్రులు ఇక్కడికే రా వాల్సి వస్తోంది. ఆత్మహత్యలకు పాల్పడ్డా పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఇక్కడికే తెస్తుంటారు. ఈ ఆస్పత్రి భవనం ఇరుకుగా ఉంది. దీనిని జిల్లా ఆస్పత్రిగా మా ర్చాలనే ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వా నికి వెళ్లాయి. ప్రస్తుతమున్న ఒకే భవనంలో ప్రసూతి విభాగం, అత్యవసర వైద్యసేవలు, టీబీ విభాగం, రక్తనిధి కేంద్రం, రెండు ఆపరేషన్ థియేటర్లున్నాయి. మరో భవనం నిర్మించి ప్రసూతి ఆస్పత్రి, మరో జనరల్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తేనే వైద్యసేవలు సంపూర్ణంగా అందే అవకాశముంది.