ఆశల ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

ఆశల ప్రయాణం

Jul 21 2025 6:07 AM | Updated on Jul 21 2025 6:07 AM

ఆశల ప

ఆశల ప్రయాణం

● జిల్లా మీదుగా రైల్వేలైన్‌ నిర్మాణం! ● మరోసారి రైల్వే మంత్రికి వినతి ● సర్వేపై సమీక్షించిన అశ్వినీ వైష్ణవ్‌ ● నెలలో డీపీఆర్‌ చేయాలని ఆదేశం ● వచ్చే బడ్జెట్‌పై జిల్లావాసుల ఆశ లు

నిర్మల్‌: దశాబ్దాలుగా కాగితాలపైనే సాగుతున్న ఆ దిలాబాద్‌ టు హైదరాబాద్‌ వయా నిర్మల్‌.. రైల్వేలై న్‌ నిర్మాణం విషయంలో ఈమధ్య కొంత కదలిక కనిపిస్తోంది. తాజాగా కేంద్రం రైల్వేశాఖమంత్రి అశ్వినీవైష్ణవ్‌ ఈమార్గం నిర్మాణంపై అధికారులతో కీలక సమీక్ష నిర్వహించడం గమనార్హం. వరంగల్‌లోని కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ను సందర్శించేందుకు శనివారం ఆయన ప్రత్యేక రైలులో హైదరాబాద్‌ నుంచి కాజీపేటకు చేరుకున్నా రు. ఈరైలులో నిర్మల్‌ ఎమ్మెల్యే, బీజేఎల్పీనేత ఏలే టి మహేశ్వర్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌ మీదుగా ఆర్మూర్‌ వరకు రైల్వేలైన్‌ నిర్మాణం గురించి మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు వివరించారు.

నెలలో డీపీఆర్‌కు ఆదేశం

గతంలో ఉన్న ప్రతిపాదనల మేరకు ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వరకు వయా నిర్మల్‌, ఆర్మూర్‌ మీదుగా రైల్వేలైన్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ వె ల్లడించారు. ఈ లైన్‌కు సంబంధించిన తాజా సర్వే కూడా ఇటీవల పూర్తి కావడంతో ఆ వివరాలపై రై ల్వే అధికారులతో ఆయన సమీక్షించారు. నెలలో డీటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) సిద్ధం చేసి రైల్వేబోర్డుకు పంపించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ఈ మార్గానికి సంబంధించిన ప నులు ప్రారంభించాలని ఎమ్మెల్యేలు కోరగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.

ఏడాదిపైనే పట్టే అవకాశం

రైల్వే నిర్మాణం అంటేనే తరాలు గడిచిపోతాయి. ఇ ప్పటికే జిల్లా మీదుగా లైన్‌ నిర్మాణం ముచ్చట వింటూ మూడు తరాలు పోయాయి. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు ఆదిలాబాద్‌–హైదరా బాద్‌ లైన్‌ నిర్మాణంలో భాగంగా ప్రాథమికంగా స ర్వే మాత్రమే పూర్తయింది. ఇక దక్షిణ మధ్య రైల్వే ఈ లైన్‌కు సంబంధించి డీపీఆర్‌, నిధులకు సంబంధించిన ఎస్టిమేషన్‌ సిద్ధం చేసి రైల్వేబోర్డుకు పంపించాలి. బోర్డు నుంచి ఆర్థికశాఖకు అక్కడి నుంచి కేంద్ర కేబినేట్‌కు వెళ్తుంది. ఆ తర్వాత బడ్జెట్‌లో పెట్టి ని ధులు మంజూరు చేయడం, టెండర్లు, భూ సేకరణ తదితర పనులుంటాయి. ఇవన్నీ కావాలంటే ఏడాదిపైనే పట్టనుంది. ఇందులో ప్రధానంగా రైల్వేబోర్డు సమావేశాలే చాలా జాప్యమవుతుంటాయి.

హైదరాబాద్‌ వరకూ..

రాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఆదిలాబాద్‌ ప్రాంతాన్ని రాజధాని హైదరాబాద్‌తో మరింతగా అనుసంధానించడానికే కేంద్రం మొగ్గుచూపుతోంది. ప్రధాని మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన నుంచీ ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వరకు రైల్వేలైన్‌ నిర్మాణాన్ని ప్రతిపాదిస్తూ వస్తోంది. 2023లో ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌, బోధన్‌, బా న్సువాడ, నిజాంపేట్‌, సంగారెడ్డి మీదుగా పటా న్‌చెరు వరకు రూ.5,706కోట్లతో లైన్‌ నిర్మాణాని కి ప్రణాళిక సిద్ధం చేసింది. మూడు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆర్మూర్‌, డిచ్‌పల్లి మీదుగా పటాన్‌చెరు వరకు రైల్వేలైన్‌ ప్రతిపాదన చేసింది. ఆ మార్గాన్నే మా రుస్తూ 2023లో తాజాగా ప్రతిపాదనలు చేశా రు. ఇక కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో కేవలం ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌ మీదుగా ఆర్మూర్‌ వరకు లైన్‌ వేస్తే సరిపోతుందని, జాయింట్‌ వెంచర్‌కు తాము సిద్ధమంటూ ప్రతిపాదన తీసుకువచ్చారు. ఇందుకు అప్పట్లో కేంద్రం ఒప్పుకొ న్నా.. చివరకు రాష్ట్ర ప్రభుత్వం జాయింట్‌వెంచర్‌కు ముందుకు రాకపోవడంతో అలాగే నిలిచి పోయింది. తాజాగా ఆదిలాబాద్‌ నుంచి పటాన్‌చెరు (హైదరాబాద్‌) రూట్‌లో చేపట్టిన సర్వేనే రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ సమీక్షించారు. మరో వైపు ఏ రూట్‌ ప్రతిపాదించినా ముందుగా ఆది లాబాద్‌ వైపు నుంచి పనులు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఇలాగైతే కనీసం ఆది లాబాద్‌–నిర్మల్‌–ఆర్మూర్‌ లైన్‌ త్వరగా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు.

త్వరగా చేపట్టాలని కోరాం

ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ రైల్వేలైన్‌ నిర్మాణంలో భాగంగా వయా నిర్మల్‌–ఆర్మూర్‌ మార్గానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను కోరాం. త్వరలో ఈ లైన్‌కు సంబంధించి ఆర్థిక అనుమతులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

– ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీనేత

ఆశల ప్రయాణం1
1/2

ఆశల ప్రయాణం

ఆశల ప్రయాణం2
2/2

ఆశల ప్రయాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement