
వనితకు భరోసా
● ప్రమాద బీమా పొడిగింపు ● ఎస్‌హెచ్‌జీలకు ప్రయోజనం
నిర్మల్‌చైన్‌గేట్: మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారి ప్రమాద బీమాను 2029వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బీమా పథకం సీ్త్రనిధి ద్వారా అమలు జరుగుతుందని అందులో పేర్కొన్నారు. దీంతో జిల్లాలోని మహిళా స్వయం సహాయ సంఘాలకు భరోసా కల్పించినట్లయింది. జిల్లా గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో 18–59 ఏళ్ల వారు స్వ యం సహాయక సభ్యురాలిగా ఉన్నట్లయితే బీమా పథకం వర్తిస్తుంది. సంఘాల్లో సభ్యులెవరైనా ప్ర మాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షలు, సహజ మర ణం పొందితే రూ.2 లక్షల బీమా పరిహారం సొ మ్మును వారి నామినీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. వారికి సంబంధించిన రుణాన్ని కూడా మాఫీ చేస్తారు. 50శాతం మించిన అంగవైకల్యం ఏర్పడితే సదరం ధ్రువపత్రం ద్వారా పరిశీలించి రూ.5లక్షలు అందజేయనున్నారు. జిల్లాలో 505 గ్రామైక్య సంఘాలుండగా, 12,215 పొదుపు సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో 1,34,002 మంది సభ్యులున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వీరు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు పొందుతూ వివిధ యూనిట్లు నెలకొల్పి ఉపాధి పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రమాద బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం జిల్లాలో ముగ్గురు సభ్యులు ప్రమాదాల్లో మరణించగా వారికి రూ.30లక్షలు విడుదలయ్యా యి. వీటిని త్వరలో జిల్లా అధికారులు బాధిత కు టుంబాలకు పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు.