
గజ్జలమ్మ దేవికి పూజలు
కుంటాల: మండల కేంద్రంలోని గజ్జలమ్మదేవి ఆల యం ఆదివారం కిటకిటలాడింది. ఇతర జిల్లాలను ంచి కూడా భక్తులు అధికసంఖ్యలో వచ్చి గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్లకు పూజలు చేశారు. బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు.
అడెల్లి పోచమ్మకు మొక్కులు
సారంగపూర్: ఆషాఢ మాసం చివరి ఆదివారం కా వడంతో అడెల్లి మహాపోచమ్మను భక్తులు అధికసంఖ్యలో దర్శించుకున్నారు. బోనాలు సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్‌లోని గండిపేట్ ఏరియా ఏసీపీ రమణాగౌడ్–భారతి దంపతులు అమ్మవారిని దర్శించుకోగా, ఆలయ ఈవో భో జాగౌడ్, సిబ్బంది ఆయనను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. నిర్మల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షు డు దశరథ రాజేశ్వర్, ఆలయ డైరెక్టర్లు ప్రభాకర్‌గౌ డ్, నర్సారెడ్డి, లక్ష్మి, ఈవో రమేశ్, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ, సిబ్బంది ఉన్నారు.