
పోస్టర్ ఆవిష్కరణ
ఖానాపూర్: పట్టణంలోని ఎరుకలవాడలో ఆగస్టు 3న హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరా ట సమితి 29వ ఆవిర్భావ వేడుకల పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు లోకిని రాము, జిల్లా అధ్యక్షుడు లోకిని గోపి మాట్లాడారు. ఆవిర్భావ వేడుకలకు కులస్తులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పోరాటాలతోనే హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. నాయకులు గర్క పెద్దగంగారాం, లోకిని జూని, గరక చిన్న య్య, జెట్టి శ్రీనివాస్, గర్క నర్సయ్య, కాండ్లి పోషన్న, గంగశ్రీనివాస్, కనకయ్య, రాజేశ్వర్, మహేశ్, రాము, పోసవ్వ, లక్ష్మి ఉన్నారు.