
ఎమ్మెల్యే ‘ఏలేటి’పై పోలీసులకు ఫిర్యాదు
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర గీతాన్ని అవమానపరిచారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిపై ఆదివారం స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి సంబరాల్లో భా గంగా రాష్ట్ర గీతాన్ని ఆలపించేటప్పుడు ఎమ్మెల్యే, సెర్ప్ డైరెక్టర్ కృష్ణమూర్తి కుర్చీల్లోంచి లేచి నిలబడలేదని ఆరోపించారు. రాష్ట్ర గీతాన్ని అవమానపరిచి న వీరు వెంటనే తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని, మహేశ్వర్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి కష్ణమూర్తిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో పార్టీ పట్టణా ధ్యక్షుడు నాందేడపు చిన్ను, ఏఎంసీ చైర్మన్ సోమ భీ మిరెడ్డి, నాయకులు జునైద్, సమ్మర్, హరీశ్, రాకేశ్, రామకృష్ణ, పోశెట్టి, శ్రీకాంత్‌యాదవ్, సాయి, కిసర్, సంతోష్, ఫిరోజ్, సర్దార్, ప్రవీణ్ పాల్గొన్నారు.