
ముందస్తు చర్యలు చేపట్టాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● చించోలి(బీ)లో నిర్వహిస్తున్న విపత్తు నిర్వహణ శిక్షణ పరిశీలన ● ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి తనిఖీ
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో వర్షాలు, అకాల వరదలు సంభవించినపుడు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బుధవారం చించోలి (బీ) సమీపంలోని ప్రభుత్వ మైనారిటీ పాఠశాలలో నిర్వహించిన విపత్తు నిర్వహణ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్‌ఎ ఫ్ బృందం సహాయక విన్యాసాలు, ప్రజలకు అ వగాహన కల్పించే ప్రదర్శనలను పరిశీలించారు. బృంద సభ్యుల పనితీరును అభినందించారు. వారి వద్ద ఉన్న ఆధునిక పరికరాల వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో అవి ఎలా ఉపయోగపడతాయన్న అంశాలపై అధికారులను అడిగి తెలు సుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా గోదావరి, స్వర్ణ, ఎస్సారెస్పీ, క డెం ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాలు, జీఎన్‌ఆర్ కాలనీ తదితర లోతట్టు ప్రాంతాల ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వరదల సమయంలో ముందస్తు చర్యలు చేపట్టేందుకు జిల్లా స్థాయిలో ఫ్లడ్ మా న్యువల్ తయారు చేసినట్లు తెలిపారు. కడెం, ఖా నాపూర్, సారంగపూర్, దస్తురాబాద్, భైంసా మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు 15 రోజులుగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందం పనిచేస్తుందని పేర్కొన్నారు. వరదల సమయంలో ప్రజలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌ను సంప్రదించాలని సూ చించారు. అనంతరం మైనార్టీ పాఠశాల ప్రాంగణంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో అదనపు ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో లక్ష్మీకాంతం, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఆస్పత్రిలో తనిఖీలు
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ అభిలాష అభిన వ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా విభాగాలు పరిశీలించారు. రోజువారీ ఓపీ వివరాలు తెలుసుకున్నారు. చిల్డ్రన్స్ వార్డును పరిశీలించి మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. మందుల గదులు, టీకా నిల్వల గురించి తెలుసుకున్నారు. సరిపడా మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. అ నంతరం ల్యాబ్ విభాగాన్ని పరిశీలించి అందుబా టులో ఉన్న పరీక్షల వివరాల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పార్కింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవుట్‌పోస్ట్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి పర్యవేక్షకుడు గోపాల్‌సింగ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.