
లింగనిర్ధారణ చట్టరీత్యా నేరం
నిర్మల్‌చైన్‌గేట్: లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించ డం చట్టరీత్యా నేరమని డీఎంహెచ్‌వో రాజేందర్ హెచ్చరించారు. భ్రూణ హత్యలను నివారించి ఆడపిల్లలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వైద్యారో గ్యశాఖ కార్యాలయంలో జిల్లా అడ్వైజరీ కమిటీ (పీసీ అండ్ పీఎన్టీఈ యాక్ట్ 1994) రేడియాలజిస్ట్, గైనకాలజిస్టులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులపై కఠి నచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆడపిల్లల ప్రాధాన్యతపై గ్రామ, పట్టణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించడానికి చేపట్టాల్సిన చర్యల పై చర్చించారు. గర్భస్రావాలు నిర్వహించే ఆస్పత్రులు ఎంటీపీ ఆక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి రవీందర్, కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ సౌమ్య, విన్ని, వాసు, సఖీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ శ్వేత, డీపీఆర్వో విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.