కడెం ఆయకట్టుకు సాగునీరు | - | Sakshi
Sakshi News home page

కడెం ఆయకట్టుకు సాగునీరు

Jul 15 2025 6:15 AM | Updated on Jul 15 2025 6:15 AM

కడెం

కడెం ఆయకట్టుకు సాగునీరు

● నేడు విడుదల చేయనున్న ఎమ్మెల్యే బొజ్జు ● ఖరీఫ్‌ పంటలకు భరోసా.. ● సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు

కడెం: నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టు కింద సాగుచేసిన ఖరీఫ్‌ పంటలకు సాగునీరు ఇవ్వాలని అధికా రులు నిర్ణయించారు. జలాశయంలో నీటిమట్టం ఆశాజనకంగా ఉండడంతో మంగళవారం ఉద యం నీటిని విడుదల చేయనున్నారు. గతేడాది జూలై 14న ప్రాజెక్టు నీటిమట్టం 683.625 అడుగులు ఉండగా, ఈ ఏడాది 694.600 అడుగులకు చేరుకోవడంతో రైతులు సంతోషంగా ఉన్నా రు. తాజాగా అధికారులు ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ మంగళవారం ఆయకుట్టుకు నీటిని విడుదల చేస్తారని ప్రాజెక్టు ఈఈ విఠల్‌ తెలిపారు.

కాలువ మరమ్మతు పూర్తి..

కడెం ప్రాజెక్టు ఎడమ కాలువకు రూ.33.5 లక్షలతో కడెం, దస్తురాబాద్‌ మండలాల పరిధిలో 16 కిలోమీటర్ల మేర ఇటీవల మరమ్మతు పనులు చేపట్టారు. పిచ్చిమొక్కలు, చెత్త, పూడికను తొలగించి, దెబ్బతిన్న కాలువలను బాగుచేశారు. ఈ మరమ్మతులతో కాలువ శుభ్రమై, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందనుంది.

రైతుల్లో ఉత్సాహం..

కడెం ప్రాజెక్టు కాలువల ద్వారా వానాకాలం సీజన్‌లో కడెం, దస్తురాబాద్‌, జన్నారం, దండేపల్లి, హాజీపూర్‌, లక్సెట్టిపేట మండలాల పరిఽ దిలోని 68,150 ఎకరాలకు సాగునీరు అందుతుంది. గతేడాదికన్నా ముందుగానే నీటిని విడుదల చేస్తుండడంతో సాగు జోరందుకోనుంది.

నిండు కుండలా కడెం ప్రాజెక్టు

చివరి ఆయకట్టు వరకు

వానాకాల పంటల సాగుకు కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తాం. ప్రాజెక్టులో ఆశాజనకంగా నీటిమట్టం ఉండడంతో సాగు నీటిని వదలాలని నిర్ణయించాం. ఇంకా రెండు నెలలు వర్షాలు కురుస్తాయి. మంచి వర్షాలు కురిస్తే యాసంగి పంటలకు కూడా నీరు అందించే అవకాశం ఉంటుంది. – విఠల్‌, ప్రాజెక్టు ఈఈ

కడెం ఆయకట్టుకు సాగునీరు 1
1/2

కడెం ఆయకట్టుకు సాగునీరు

కడెం ఆయకట్టుకు సాగునీరు 2
2/2

కడెం ఆయకట్టుకు సాగునీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement