
నాగేశ్వర సిద్ధాంతికి పురస్కారం
నిర్మల్: జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురికి చెందిన ప్రముఖ పంచాంగకర్త గాడిచెర్ల నాగేశ్వరసిద్ధాంతి తెలంగాణ విద్వత్సభ నుంచి విశిష్ట పురస్కా రం అందుకున్నారు. హైదరాబాద్‌లో ఆదివా రం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకరభారతీస్వామి పురస్కారం ప్రదానం చేశారు. 95 ఏళ్లుగా గాడిచెర్ల కుటుంబం అందిస్తున్న పంచాంగ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖరశర్మ, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి తదితరులు పాల్గొన్నారు.