
వ్యాధి సోకితే 1962కు డయల్ చేయండి
జిల్లాలోని పశువులకు గొర్రెలకు, మేకలకు ఎలాంటి వ్యాధిలు సోకినా వెంటనే 1962 నంబరుకు డయల్ చేయాలి. 1962 అంబులెన్సు సిబ్బంది గ్రామాలకు చే రుకుని పశువులకు, మేకలకు, గొర్రెలకు చికిత్స అందిస్తారు. తగిన మందులు అందజేస్తారు. వ్యాధి తీవ్ర త ఎక్కువగా ఉంటే వైద్య నిపుణులకు సమాచారం అందించి మెరుగైన చికిత్సను అందిస్తారు. పశువైద్యుల సలహాలు సూచనల మేరకు చికిత్స చేయించుకోవాలి. ఇలెగాంలో మేకల మరణాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
– బాలిగ్ అహ్మద్, జిల్లా పశువైద్యాధికారి