
గ్రంథాలయం.. పఠనోత్సాహం
● విద్యార్థుల్లో అభిరుచి పెంచేలా విద్యాశాఖ చర్యలు ● పాఠశాలల్లో గ్రంథాలయాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి ● ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు నిర్వహణలో శిక్షణ..
నిర్మల్‌ఖిల్లా: రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల్లో పఠనాభిరుచి పెంపొందించే లక్ష్యంతో గ్రంథాలయాలను బలోపేతం చేస్తున్నాయి. జిల్లాలోని 756 పాఠశాలల్లో ‘రీడింగ్ కార్నర్’ల పేరిట గ్రంథాలయాలు రూమ్ టు రీడ్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేశారు. వీటిలో కథలు, బొమ్మలు, వైజ్ఞానిక పుస్తకాలను అందుబాటులో ఉంచారు. రోజువారీ బోధనలో గ్రంథాలయ పీరియడ్‌ను చేర్చారు. రోజుకు ఒక పీరియడ్ గ్రంథాలయ సమయంగా కేటాయించడం ద్వారా విద్యార్థులు చదవడం అలవాటు చేసుకుంటున్నారు. ఈ పుస్తకాలు జిజ్ఞాస, మేధోశక్తి, భాషా సామర్థ్యాలను పెంచుతున్నాయి.
ఉపాధ్యాయులకు శిక్షణ..
గ్రంథాలయ నిర్వహణ, పఠన అభిరుచి పెంపొందించేందుకు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఈ నెల 17 నుంచి 19 వరకు మూడు రోజులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లా నుంచి ఏ.గోపాల్ (పెండ్‌పల్లి), ఎం.ఎల్లన్న (వానల్‌పాడ్) ఈ శిక్షణకు వెళ్లారు. వారు జిల్లాకు వచ్చి స్థానిక ఉపాధ్యాయులకు తిరిగి శిక్షణ ఇవ్వనున్నారు.
అభిరుచి అలవాటుగా మారేలా..
చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో పఠనాభిలాష వృద్ధి చెందితే, అదికాస్త అలవాటుగా మారుతుంది. తద్వారా విద్యార్థుల భవిష్యత్తు పురోగమనం ఉజ్వలంగా ఉంటుంది. ఇందుకోసం గ్రంథాలయ ప్రాధాన్యతపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలోని ఉపాధ్యాయులు కూడా తమ పాఠశాలల్లో గ్రంథాలయ పీరియడ్ ఉండేలా చూస్తున్నారు. – పి.రామారావు, డీఈవో
●
ప్రాముఖ్యత..
పఠన సామర్థ్యం: విద్యార్థులు వ్యక్తిగతంగా, బృందంగా పఠన అలవాటును అభివృద్ధి చేసుకుంటారు.
వైజ్ఞానిక జిజ్ఞాస: రంగురంగుల పోస్టర్లు, కథలు, వైజ్ఞానిక పుస్తకాలు జిజ్ఞాసను రేకెత్తిస్తాయి.
సమాజ భాగస్వామ్యం: గ్రంథాలయ క్ల బ్‌ల ద్వారా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం పె రుగుతుంది.

గ్రంథాలయం.. పఠనోత్సాహం

గ్రంథాలయం.. పఠనోత్సాహం