
ఆర్‌ఎంపీలు యాంటిబయాటిక్స్ ఇవ్వొద్దు
లక్ష్మణచాంద: జిల్లాలోని ఆర్‌ఎంపీలు యాంటి బయాటిక్స్ రోగులకు ఇవ్వొద్దని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేంద ర్ ఆదేశించారు. మండలంలోని వడ్యాల్, లక్ష్మణచాంద గ్రామాల్లోని ఆర్‌ఎంపీ క్లినిక్‌ల ను గురువారం తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చికిత్సచేస్తున్న శాంతి క్లినిక్, వాణి క్లినిక్, మామడ మండలం పరిమండల్ గ్రామంలోని హారిక క్లీనిక్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆర్‌ఎంపీలు వారి పేరు ముందు డాక్టర్ అని రాయకూడదని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన వెంట డాక్టర్ సౌమ్య, బారె రవీందర్ ఉన్నారు.
హెచ్‌ఐవీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: హెచ్‌ఐవీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్ అన్నారు. పట్టణంలోని విశ్వనాథ్‌పేట్‌లో సమగ్ర ఆరోగ్య పరీక్షల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హెచ్‌ఐవీ నిర్ధారణ శిబిరాన్ని గురువారం సందర్శించారు. మీ దగ్గరికి వచ్చే ఆరోగ్య సిబ్బంది వద్ద హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల క్లస్టర్ మేనేజర్ నాగరాజు, జిల్లా సూపర్‌వైజర్ అనిల్‌కుమార్, బంగల్‌పేట్ అర్బన్ పీహెచ్‌సీ డాక్టర్ మనీషా, సూర్ ఎన్జీవో పీఎం మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.