
పారదర్శకంగా సోషల్ ఆడిట్
సోన్: మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదిక సోమవారం నిర్వహించారు. ఇన్‌చార్జి డీఆర్డీవో శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. 2024–25 సంవత్సరంలో మండలంలో రూ.4.63 కోట్ల ఉపాధి పనులు చేపట్టినట్లు తె లిపారు. గ్రామాలలో తనిఖీ బృందాలు నిర్వహించిన తుది నివేదిక చదివి వినిపించారు. సో షల్ ఆడిట్ పారదర్శకంగా జరిగిందన్నారు. మాస్టర్ ఎంట్రీలలో తప్పులు జరగకుండా చూ సుకోవాలని ఇబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ లక్ష్మయ్య, సోషల్ ఆడిట్ ఎస్‌ఆర్‌పీ వెంకన్న, ఎంపీడీవో సురేశ్, హెచ్‌ఆర్‌ఎం సుధాకర్ ఎన్‌పీవో ఖలీల్ అహ్మద్, ఏపీవో మంజుల, ఎఫ్‌ఏలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.