
అభివృద్ధిలో అగ్రగామి
దండెపల్లి/జన్నారం/మంచిర్యాలరూరల్(హాజీపూర్)/లక్సెట్టిపేట: అభివృద్ధిలో మంచిర్యాల జిల్లా రా ష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు పుష్కల అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. లక్సెట్టిపేటలో నిర్మించిన 50 పడకల సామాజిక ఆస్పత్రి, కళాశాల భవనాన్ని ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి ప్రారంభించారు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్ ప్రాజెక్ట్ట్, హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో 212 ఎకరాల్లో నిర్మించే దత్తసాయి ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ పార్క్, ఆటోనగర్ పార్క్ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. నలుగురు మంత్రల పర్యటనతో జిల్లాలో పండుగ వాతావరణం కనిపించింది.
మధిరతో సమానం..
మంచిర్యాల జిల్లాను తన సొంత నియోజకవర్గం మధిరతో సమానంగా భావిస్తూ రాష్ట్రంలో రోల్‌మాడల్‌గా నిలిపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చా రు. రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళశక్తి సోలార్ ప్రాజె క్ట్ ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడారు. ప్రా ణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ పనులను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. మంచిర్యాలలో 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, లక్సెట్టిపేటలో 50 పడకల ఆస్పత్రి, కళాశాల భవన నిర్మాణం పూర్తయినట్లు తె లిపారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కోరినట్లు దండేపల్లి మండలంలో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, 220, 400 మెగావాట్ల సబ్‌స్టేషన్లు దశలవారీగా నిర్మిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.
అభివృద్ధికి నాంది..
మంచిర్యాలలో 300 ఎకరాల్లో ఐటీ, ఇండస్ట్రియల్, ఆటోనగర్ పార్కుల ఏర్పాటుతో అభివృద్ధికి నాంది పడిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మొదటి దశగా 240 ఎకరాలు సేకరించి, 212 ఎకరాల్లో ఈ పార్క్‌ల నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు రూ.30 కోట్ల నిధులు కేటాయించామన్నారు. ఇందుకు పరిశ్రమల శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ పార్కుల ఏర్పాటుతో 2వేల మందికిపైగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా హైదరాబాద్, న ల్గొండ, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలతో సమానంగా అభివృద్ధి చెందుతుందని విశ్వా సం వ్యక్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరా ల ప్రేమ్‌సాగర్‌రావు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు ప్ర శంసించారు. నిధుల సేకరణ, అభివృద్ధి పనుల సరళీకరణలో ఆయన చొరవ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపే దిశగా సాగుతోందని తెలిపారు.
ఆదర్శంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. మంచిర్యాలలో నిర్మించిన 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి హైదరాబాద్‌తో సమాన వసతులతో రాష్ట్రానికే ఆదర్శంగా నిలు స్తుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు.
పర్యాటకంగా అభివృద్ధి..
అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రూ.2 కోట్లతో కళా భవన నిర్మాణం చేపడతామని తెలిపారు. హాజీపూర్ మండలం గఢ్‌పూర్ పంచాయతీ పరిధి కవ్వాల్ టై గర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో గాంధారీఖిల్లా సఫారీకి రెండు నూతన వాహనాలను మంత్రులు ప్రారంభించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రులకు ఫారెస్ట్ అధికారులు జంతువుల ఫొటోలతో కూడిన ఫ్రేమ్‌లు జ్ఞాపికలుగా అందజేశారు.
ప్రజల మద్దతుతో ముందుకు..
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడు తూ.. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం జీవి తాంతం కృషి చేస్తానని చెప్పారు. ఇంద్రవెల్లి, న స్పూర్‌లో జరిగిన బహిరంగ సభలకు లక్షలాది మంది హాజరై మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దండేపల్లి మండలంలో నాలుగు లిఫ్ట్ ఇ రిగేషన్ ప్రాజెక్టులు, రెండు విద్యుత్ సబ్‌స్టేషన్ల మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమాల్లో టీజీఐఐ సీ వైస్ చైర్మన్, ఎండీ కే శశాంక్, అటవీశాఖ కన్జర్వేటర్, ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, జిల్లా అటవీ శాఖాధి కారి శివ్ ఆశిశ్‌సింగ్, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, కలెక్టర్ కుమార్ దీపక్, ఎఫ్‌డీవో సర్వేశ్వర్, లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి అత్తె సుభాష్, వైద్యవిధా న పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్, సూపరింటెండెంట్ హరీశ్‌చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీసీహెచ్‌ఎస్ కోటేశ్వర్ డీసీపీ భా స్కర్, ఏసీసీ ప్రకాశ్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, ఐఎన్‌టీయూసీ నేతలు జనక్‌ప్రసాద్, ప్రేమ్‌చంద్, శ్రీనివాస్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థులతో కలిసి భోజం
లక్సెట్టిపేట: పట్టణంలో సామాజిక ఆస్పత్రి, ప్రభు త్వ కళాశాల భవనాల ప్రారంభోత్సవం తర్వాత మంత్రులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కళాశాల గదులన్ని తిరిగి చూశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయాలని మంత్రులకు వినతిపత్రం అందజేశారు.
నాకు మధిర ఎంతో.. మంచిర్యాల అంతే
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క
పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలు
ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు
జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
సభాస్థలి వద్ద ఉప ముఖ్యమంత్రి భటి, మంత్రులు శ్రీధర్‌బాబు, కృష్ణారావు, రాజనర్సింహ, ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు