
వరదలపై అప్రమత్తంగా ఉండాలి
దస్తురాబాద్: ఆకస్మికంగా వరదలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గోదావరి తీర ప్రాంతాలైన దేవునిగూడెం, రాంపూర్, భూత్కూర్, గొడిసెర్యాల గ్రామాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సోమవారం అవగాహన కల్పించారు. వరదల నుంచి బయటపడేందుకు ఇంట్లో ఉన్న వాటర్ బాటిళ్లు, క్యాన్‌లు, నూనె క్యాన్‌లు, ఎండిన సొరకాయ బుర్రలు, బైక్ టైర్లు వినియోగించుకోవాలని సూచించారు. ఎత్తయిన ప్రాంతాల కు వెళ్లాలని తెలిపారు. తహసీల్దార్ విశ్వంభర్, ఎన్డీఆర్‌ఎఫ్ కమాండర్లు అమర్ ప్రాతాప్‌సింగ్, వినిత్‌కుమార్, సిబ్బంది నవీన్, నిరంజన్, కుమార్, సందీప్‌సింగ్ పాల్గొన్నారు.