
ఎన్నాళ్లీ ట్రాఫికర్?
నిర్మల్: జిల్లాగా ఏర్పడి పదేళ్లు దగ్గరపడుతున్నా ఇప్పటికీ ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకో లేక పోతున్నాయి. ప్రధానంగా నిర్మల్, భైంసా, ఖా నాపూర్ మున్సిపాలిటీల్లో సమస్యలు ఏళ్లుగా తిష్టవేసి ఉన్నాయి. వీటిని ఇప్పటిదాకా సీరియస్‌గా ప ట్టించుకునేవారే లేరు. మూడు మున్సిపాలిటీల్లో పె రుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు క ల్పించడంలో అధికారులు, పాలకులు ఘోరంగా వి ఫలమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ట్రా‘ఫికర్’.. చెప్పుకోవడానికి, చూడటానికి చిన్నగానే అనిపిస్తుంది కానీ.. నిత్యనరకం చూపిస్తోంది. పన్నులు క ట్టే ప్రజలు తమ కళ్లముందే ఇబ్బందులు పడుతు న్నా సంబంధిత మున్సిపల్ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదనే వాదన పెరుగుతోంది. సా క్షాత్తు ఉన్నతాధికారులు ఉండే జిల్లాకేంద్రంలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయని దుస్థితి ఉంది. ఇక రోడ్లపైనే ఇష్టారీతిగా పార్కింగ్‌లు, తోపుడుబండ్లు, దు కాణాలు కొనసాగుతుండగా బాటసారులు, వాహ నచోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు.
నిర్మల్‌లో నిత్యనరకం
జిల్లా కేంద్రమన్నట్లే గానీ.. ఇక్కడ ఉన్నన్ని ట్రాఫిక్ ఇక్కట్లు ఎక్కడా లేవు.
● చుట్టుపక్కల ఉన్న భైంసా, ఖానాపూర్ లాంటి చిన్నపట్టణాల బస్టాండ్లు చాలా నయం. కానీ.. జిల్లాకేంద్రమైన నిర్మల్ బస్టాండ్ పరిస్థితి మరీ దారుణం. ఎక్కడి నుంచి ఏ వాహనం వస్తుందో తెలియదు. బస్టాండ్‌లో నుంచి బస్సు బయటకు రావాలన్నా.. లోపలికి వెళ్లాలన్నా.. పెద్ద ప్రహసనమే. ఉన్నదే ఇరుకురోడ్డంటే ఆ రోడ్డులో సగం దాకా దుకాణాలు పెట్టేస్తున్నారు. ట్రాఫిక్ అధి కంగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో పరిస్థితి మరింత నరకంగా మారుతోంది.
● వివేక్‌చౌక్ నుంచి మొదలు పెడితే పింజరిగుట్ట క్రాస్‌రోడ్డు వరకు పాతబస్టాండ్ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఉదయం 10నుంచి 8 గంటల వరకు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇక్కడ కొన్నేళ్లుగా వాహనాలను సెంట్ర ల్ పార్కింగ్ పెడుతున్నారు. ఇది ఇంకా ఇబ్బంది పెడుతోంది. బైక్‌పై వెళ్తే పరవాలేదు కానీ.. ఆటోలు, కార్లు ఇంకా భారీ వాహనాలైతే ఈ మార్గంగుండా వెళ్లడం కష్టమే. అత్యవసర పరిస్థితుల్లో 108, పోలీస్, ఫైర్ లాంటి వాహనాలు ఈ రూట్‌లో నుంచి వెళ్లే పరిస్థితి లేదు.
● ఎన్‌హెచ్–61పై ఉన్న ఈద్‌గాం చౌరస్తాలోనూ కనీసం సిగ్నల్స్ పనిచేయడం లేదు. ఈ చౌరస్తా సమీపంలోనే ఐదారు పెద్ద స్కూళ్లున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో బడిపిల్లలూ వెళ్లాల్సి ఉంటుంది. ఓవైపు హైవేపై భారీవాహనాలు మరోవైపు మున్సిపల్ వైపు నుంచి, ఆదర్శనగర్ వైపు నుంచి అధికసంఖ్యలో వచ్చే వాహనాలతో రోడ్డు దాటడం సమస్యగా మారుతోంది.
● ఆర్డీవో కార్యాలయం ఎదుట, జయశంకర్‌సార్ సర్కిల్, వివేక్‌చౌక్, అంబేద్కర్‌చౌక్‌లోనూ ట్రాఫి క్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. ఇక్కడ కూడా వాహనాలు ఇష్టారీతిన వస్తుండటంతో ట్రాఫిక్ దిగ్బంధంలో ఇరుక్కుపోవాల్సి వస్తోంది.
సమస్య పరిష్కరిస్తాం
జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్య కొంత ఇబ్బందికరంగానే ఉంది. త్వరలోనే సిగ్నల్స్ సమస్య పరిష్కరిస్తాం. రోడ్లపై ఆక్రమణలు, పార్కింగ్ తదితర సమస్యలపై రెవెన్యూ, పోలీస్‌శాఖలతో సంప్రదించి చర్యలు తీసుకుంటాం. – జగదీశ్వర్‌గౌడ్,
మున్సిపల్ కమిషనర్, నిర్మల్
భైంసాలోనూ ఇబ్బందులే..
వాణిజ్యపరంగా పేరున్న భైంసా పట్టణం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు లేక ఇక్కడా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ప్రధానంగా నిర్మల్‌చౌరస్తా–బస్టాండ్–గంజ్‌రోడ్డు వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. మున్సిపల్ కార్యాలయం నుంచి పంజేషాచౌక్ దాకా రోడ్డులో భారీ వాహనాలు వస్తే మరో వాహనం వెళ్లే పరిస్థితి లేదు. మిర్చియార్డు వద్ద రోడ్డు కూడా ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు కష్టంగా మారింది. బస్‌డిపో నుంచి పార్డీ(బీ) బైపాస్ రోడ్డు వరకు గల హైవేపై ఎక్కడా యూటర్న్‌లు, ట్రాఫిక్ సిగ్నల్స్ లేక రాంగ్‌రూట్‌లో ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఖానాపూర్‌లోనూ కష్టమే..
కొత్త మున్సిపాలిటీగా ఏర్పడ్డా.. ఖానాపూర్ కష్టాలు తీరడం లేదు. రోజురోజుకూ ఇక్కడా ట్రాఫిక్ కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ చేయకముందే డివైడర్ నిర్మించడం ఇక్కడ లోపంగా మారింది. తరచూ యాక్సిండెంట్లు అవుతున్నాయి. జగన్నాథరావుచౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బస్టాండ్ వద్ద ప్రైవేట్ వాహనాలు ఇష్టారాజ్యంగా నిలపడం ఇబ్బందికరంగా మారుతోంది.
ఇష్టారీతిన వాహనాల పార్కింగ్
సగం రోడ్డెక్కుతున్న దుకాణాలు
మూడు మున్సిపాలిటీల్లో సమస్య
పట్టింపులేని బల్దియా అధికారులు
బాటసారులకు తప్పని ఇబ్బందులు
నిర్మల్ బస్టాండ్ ప్రాంతంలో ఇదీ.. పరిస్థితి

ఎన్నాళ్లీ ట్రాఫికర్?

ఎన్నాళ్లీ ట్రాఫికర్?