
సేంద్రియం.. ప్రోత్సాహం
● జిల్లాలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ అమలు ● 13 మండలాల్లో 15 క్లస్టర్ల ఏర్పాటు ● ఒక్కో క్లస్టర్ పరిధిలో 125 మంది రైతుల గుర్తింపు ● 1,875 ఎకరాల్లో సాగుకు సన్నాహాలు
నిర్మల్‌చైన్‌గేట్: రైతులు పంటల దిగుబడి కోసం రసాయన ఎరువులను అధికంగా వినియోగిస్తుండటంతో భూసారం దెబ్బతినడంతోపాటు, రసాయనాలతో కూడిన పంటలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా భూమి నిర్జీవం కావడం, పర్యావరణానికి, మానవాళికి కలిగే నష్టాలను వివరిస్తూ, రైతులను సేంద్రియ సాగువైపు మళ్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 13 మండలాల్లో 15 గ్రామాలను పైలట్ గ్రామాలుగా ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి 125 మంది రైతులను ఎంచుకొని, ఏడాదిపాటు సేంద్రియ పద్ధతిలో పంటలు పండించేందుకు చర్యలు చేపట్టారు.
జాతీయ మిషన్ లక్ష్యం
వాతావరణ మార్పులు, చీడపీడల ఉధృతి, నీటి లభ్యత తగ్గుదల, ఉత్పత్తి క్షీణత వంటి సవాళ్లను అధిగమించేందుకు, సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి సేంద్రియ సాగువైపు మళ్లించేందుకు ఈ జాతీయ మిషన్ ఏర్పాటైంది. ఈ పథకం ద్వారా భూసారాన్ని కాపాడటం, పర్యావరణ పరిరక్షణ, రసాయన రహిత ఆరోగ్యకర ఆహారం అందించడం లక్ష్యంగా పనిచేస్తుంది.
భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా..
ఎంపిక చేసిన గ్రామాల్లో రైతుల పొలాల నుంచి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు మట్టి న మూనాలను సేకరించి, సేంద్రియ సాగు లాభాల ను వివరిస్తున్నారు. రెండు నెలల క్రితం గ్రామాల ఎంపిక పూర్తయింది. మట్టి నమూనాల సేకరణ పూ ర్తి చేసి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ఎకరం భూమి కలిగిన రైతులను ఎంపిక చేశారు.
మహిళా సీఆర్పీల నియామకం
సేంద్రియసాగును విస్తరించేందుకు, గ్రామాల్లోని మహిళా సంఘాల నుంచి చదువుకున్న, వ్యవసా య అనుభవం కలిగిన మహిళలను కమ్యూనిటీ రి సోర్స్ పర్సన్(సీఆర్పీ)లుగా ఎంపిక చేస్తారు. వీరికి నెలకు రూ.4 వేల వేతనం అందిస్తారు.
ఎకరంలో సాగు..
ఎంపిక చేసిన రైతులు తమ పొలంలో ఒక ఎకరంలో సేంద్రియ సాగును చేపట్టనున్నారు. భూసార పరీక్షల ఆధారంగా, ఏ పంట సాగు చేయాలో వ్యవసాయ అధికారులు సూచిస్తారు. రైతులకు మొదటి విడతలో వేప పిండి, వేప నూనె వంటి సేంద్రియ ఉత్పత్తులను ఉచితంగా అందిస్తారు. అలాగే, సేంద్రియ పంటలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌పై రైతులకు అవగాహన కల్పిస్తారు.
పథకం ప్రధాన లక్ష్యాలు
● వ్యవసాయ ఖర్చులను తగ్గించడం.
● భూసారం, పర్యావరణ పరిరక్షణ.
● రసాయన రహిత, పోషక విలువలతో కూడిన ఆరోగ్యకర ఆహారం అందించడం.
● విభిన్న పంటల సాగుతో జీవవైవిధ్యాన్ని పెంపొందించడం.
అవగాహన కల్పిస్తున్నాం..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఎంఎన్‌ఎఫ్ పథకాన్ని అమలుచేస్తూ రైతులకు సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తున్నాం. మండలంలో పైలట్ గ్రామంగా ఎంపికై న నందిమళ్లలో ఇప్పటికే మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించాం. సేంద్రియ సాగు ప్రోత్సాహానికి కేంద్రం అందించే రాయితీ నేరుగా రైతులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నాం. – వికార్ అహ్మద్,
మండల వ్యవసాయ అధికారి, సారంగాపూర్
ఇది మంచి పథకం..
జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకం ఎంతో ఉన్నతమైంది. ఈమేరకు దీనిని జిల్లాలో అమలు చేయడానికి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాం. 15 క్లస్టర్లలో 1,875 మంది రైతులను గుర్తించాం. త్వరలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– అంజి ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
ఎంపికై న కస్టర్ల వివరాలు..
మండలం క్లస్టర్ గ్రామ
పంచాయతీ
దిలావర్పూర్ గుండంపల్లి కాల్వ
నిర్మల్ రూరల్ చిట్యాల తల్వేద
లక్ష్మణచాంద పీచర పీచర
నర్సాపూర్(జి) చాకుపెల్లి నందన్
సారంగాపూర్ పొన్కూర్ జౌలి
సోన్ మాదాపూర్ లోకల్ వెల్మల్
మామడ పోన్కల్ పోన్కల్
కుంటాల కుంటాల కుంటాల
కుంటాల కల్లూర్ పెంచికల్పాడు
కుబీర్ హల్దా చాత
బైంసా వానల్‌పాడ్ సుంకిలి
తానూర్ బెల్తారోడా బెల్తారోడా
ముధోల్ తరోడ తరోడా,
వెంకటాపూర్
లోకేశ్వరం గడ్‌చాంద భాగాపూర్

సేంద్రియం.. ప్రోత్సాహం

సేంద్రియం.. ప్రోత్సాహం