
15న మహాధర్నా
నిర్మల్‌టౌన్: సంస్థల ఎన్నికలకు ముందే బీసీ లకు 42 శాతం రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాలని ఈనెల15న ఇందిరాపార్కు వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా తలపెట్టినట్లు ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గడిల కుమార్‌గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య, ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్, నిర్మల్ జిల్లా బీసీ సంఘాల నాయకులు మారుగోండ రాము తెలి పారు. నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మహా ధర్నా పోస్టర్లు ఆవిష్కరించారు. స్థానిక సంస్థల్లో బీసీ మహిళలకు 32 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్లతో ఈనెల 15న నిర్వ హించే మహాధర్నాలో పార్టీలకు అతీతంగా బీసీలు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు రాము, లక్ష్మణచారి, సుభాష్‌రావు, పూదరి నరహరి, విశాల్, కపిల్, నయీం, శ్రీనివాస్, సంగన్న, వీరేశ్, నవీన్, సాగర్, రాజేశ్ పాల్గొన్నారు.