
క్రమశిక్షణతో చదువుకోవాలి
లోకేశ్వరం: విద్యార్థులు వసతి గృహంలో క్రమ శిక్షణతో ఉంటూ చదువుకోవాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ సూ చించారు. మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు కార్పెట్, నోట్‌బుక్స్ శుక్రవా రం అందజేశారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలన్నారు. అర్థం చేసుకుని అవగాహన పెంచుకోవాలని సూ చించారు. విద్యార్థులకు మెనూ ప్రకారంభోజనం అందించాలన్నారు. హాస్టల్ సిబ్బంది స్థానికంగా ఉండి విద్యార్థులపై శ్రద్ధవహించాలని తెలిపారు. ఎంపీడీవో వెంకటరమేశ్, వార్డెన్ శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.