
పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
తానూరు: పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రద్ధవహించాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్ సూచించారు. తానూరు మండలం భోసి జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన బాలశక్తి కా ర్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థుల ఆరో గ్యం, నైపుణ్యాలు పెంపొందించేందుకు బాలశక్తి కార్యక్రమం అమలుచేస్తున్నట్లు తెలిపా రు. వైద్య పరీక్షలు కొనసాగించాలని, వారికి హెల్త్ కార్డులు అందించాలని వైద్యాధికారులను సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత బీసీ వసతిగృహం ప్రహరీ నిర్మాణానికి భూమి పూజచేశారు. అదనపు కలెక్టర్ ఫైజాన్‌అహ్మద్, డీఈవో రామారావు, డీఎంహెచ్‌వో రాజేందర్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ రాంగోపాల్, ఎంపీడీవో నసీరుద్దీన్ పాల్గొన్నారు.